తమ ప్రేమ విషయాన్ని మనస్సులో దాచేసుకుంటున్నారు పిల్లలు. చెప్పినా ఒప్పుకోరన్న అపనమ్మకంతో చివరకు తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని తలవంచుకుని తాళి కట్టించుకుంటున్నారు. కానీ కట్టుకున్న వ్యక్తితో సన్నిహితంగా మెలగలేక.. ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేక సతమతమౌతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
తమ ప్రేమను తల్లిదండ్రులకు చెప్పుకోలేక, మరొకరితో జీవితాన్ని పంచుకోలేక ప్రేమికులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అలాగే తల్లిదండ్రులకు చెబితే ఒప్పుకోరన్న సందేహంతో కూడా వెనకడుగు వేస్తున్నారు. చెబితే అతడితో పెళ్లి చేస్తారన్న నమ్మకం ఉండటం లేదు. సమాజంలో ప్రేమ పెళ్లిళ్ల తర్వాత జరుగుతున్న ఘటనలు చూసి కూడా తమ ప్రేమ విషయాన్ని మనస్సులో దాచేసుకుంటున్నారు. చివరకు తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని తలవంచుకుని తాళి కట్టించుకుంటున్నారు. కానీ కట్టుకున్న వ్యక్తితో సన్నిహితంగా మెలగలేక.. ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేక సతమతమౌతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఓ యువతి విషయంలో ఇదే జరిగింది. ప్రేమ, పెళ్లి, ఆమె జీవితంలో పెను విషాదాన్నే నింపింది. అంతా అయిపోయాక.. ఇప్పుడు ప్రేమించి వ్యక్తిని గురించి తెలిస్తే పెళ్లి చేశావాళ్లమంటూ పెద్దలు ఏడుస్తున్నారు. ఈ ఘటన తెలంగాణలోని హన్మకొండలో చోటుచేసుకుంది.
ప్రేమించిన వ్యక్తిని కాదని, మరొకరితో తాళి కట్టించుకున్న యువతి.. ప్రియుడిని మర్చిపోలేకపోయింది. కలిసి బతకలేమని తెలిసిన ఇద్దరు.. కలిసి చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రేమికులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో యువతి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. భీమదేవరపల్లి మండలం గొల్లపల్లికి చెందిన సంఘ లింగయ్య-రాజేశ్వరి దంపతుల కుమార్తె మానస.. విజయ్ ప్రేమించుకున్నారు. అయితే ఆమెకు ఈ నెల 11న మరో అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. పెద్దల్ని ఎదిరించలేక, మనస్సులో మాట చెప్పలేక.. తలొంచుకు తాళికట్టించుకుంది. అయితే విజయ్‌ను మర్చిపోలేని మానస.. ఈ నెల 19న హన్మకొండలో అతడిని కలిసింది. వివాహ బంధంతో కలవలేకపోయామని భావించిన ఇద్దరు..విషయం తీసుకుని ఆత్మహత్యకు యత్నించారు. వీరిని చూసిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
మానస వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్ప పొందుతూ మరణించింది. ప్రియుడు విజయ్ హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె మరణం తర్వాత .. ప్రేమించిన విషయం ముందే చెప్పి ఉంటే మరో అబ్బాయికి ఇచ్చి పెళ్ళి చేసే వాళ్ళం కాదంటున్నారు మానస తండ్రి లింగయ్య. అయితే కులాలు వేరు కావడంతోనే ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని, ప్రేమ విషయం పెద్దలకు తెలుసునని ప్రియుడు విజయ్ బంధువులు చెబుతున్నారు. అందుకే మానసను తమ సామాజిక వర్గానికి చెందిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి జరిపించినట్లు ఆరోపించారు. వీరిద్దరి ప్రేమ తెలిశాక.. ఆమెకు వివాహం నిశ్చయం చేసి పెళ్లి చేశారని అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.