మన లైఫ్ లో ముఖ్యమైన వాళ్లు మనల్ని వదిలేసి వెళ్లిపోతే మనము పోనక్కర్లేదు. ఏదో ఒక రోజు మన లైఫ్ మనకు నచ్చినట్లు మారుతుంది’అని ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఇది తెలుసుకుని పాటిస్తే ఆత్మహత్యలు, బలవన్మరణాలు, అఘాయిత్యాలు ఉండవు.
‘మన లైఫ్ లో ముఖ్యమైన వాళ్లు మనల్ని వదిలేసి వెళ్లిపోతే మనము పోనక్కర్లేదు. ఏదో ఒక రోజు మన లైఫ్ మనకు నచ్చినట్లు మారుతుంది’అని ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఇది తెలుసుకుని పాటిస్తే ఆత్మహత్యలు, బలవన్మరణాలు, అఘాయిత్యాలు ఉండవు. కానీ ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని, వారితోనే జీవితమనుకునే మాయలో బతుకుతుంటారు ప్రేమికులు. ప్రేమించిన వ్యక్తికి మరొకరితో వివాహం జరిగినా, ప్రేమలో మోసపోయినా, ఇతర కారణాలతో మనస్సును నచ్చిన వ్యక్తి దూరమైనా తట్టుకోలేక.. బలవంతంగా ఉసురు తీసుకుంటున్నారు. అటువంటి ఘటనే తెలంగాణలో జరిగింది.
ప్రేమికుడు ఆత్మహత్య చేసుకుని మరణించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన గద్వాలలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రామస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని గంటవీధికి చెందిన బోయ రామేశ్వరి (22) డిగ్రీ పూర్తి చేసింది. గాంధీచౌక్‌లో ఉండే రామతులసి అనే మహిళ ఆరోగ్య బాగోగులు చూసేందుకు వారి ఇంట్లో ఉండిపోయింది. చదువుకునే రోజుల్లో కర్నూలుకు చెందిన జయంత్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి.. అది కాస్తా ప్రేమగా మారింది. అయితే కుటుంబ సమస్యల కారణంగా ఈ నెల 14న ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న రామేశ్వరికి గుండె పగిలినంత పనైంది.
స్నేహితురాలు సంగీతతో కలిసి జయంత్ అంత్యక్రియలకు హాజరైంది. అతడు లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. తీవ్ర మనస్థాపానికి గురైన రామేశ్వరి తీవ్ర నిర్ణయం తీసుకుంది. తిరిగి విధుల్లో భాగంగా రామ తులసి ఇంటికి వచ్చిన యువతి.. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఆత్మహత్యకు ఒడిగట్టింది. ఫ్యానుకు ఉరి వేసుకుని బలన్మరణానికి పాల్పడింది. మరుసటి రోజు విధులకు వచ్చిన సంగీత.. ఫ్యానుకు వేలాడుతూ కనిపించిన స్నేహితురాలిని చూసి షాక్ తిన్నది. వెంటనే బంధువులు, పోలీసులకు సమాచారం అందించింది. ఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు వివరాలు సేకరించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించారు. రామేశ్వరి తల్లి కుర్మక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.