కొందరు ఈజీ మనీ, లగ్జరీ లైఫ్ కోసం అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అమాయక ప్రజలను మాయ మాటలతో మభ్యబెట్టి.. మోసం చేసి వారి దగ్గర అందిన కాడికి దోచుకుంటున్నవారు కొందరైతే.. మరికొందరు చెత్త పనులు చేస్తూ డబ్బులను ఆర్జిస్తున్నారు. వ్యాపారం ముసుగులో వ్యభిచారాన్ని చేసి డబ్బులు సంపాదిస్తున్న వారు మరికొందరు.
డబ్బు సంపాదనే థ్యేయంగా చాలా మంది తప్పుడు దారిలో నడుస్తున్నారు. ఈజీ మనీ, లగ్జరీ లైఫ్ కోసం అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అమాయక ప్రజలను మాయ మాటలతో మభ్యబెట్టి.. మోసం చేసి వారి దగ్గర అందిన కాడికి దోచుకుంటున్నవారు కొందరైతే.. మరికొందరు చెత్త పనులు చేస్తూ డబ్బులను ఆర్జిస్తున్నారు. వ్యాపారం ముసుగులో వ్యభిచారాన్ని చేసి డబ్బులు సంపాదిస్తున్న వారు మరికొందరు. ఇటీవల కాలంలో స్పా సెంటర్లను ఏర్పాటు చేసి.. అందులో థెరపీ పేరుతో రాసలీలలను సాగిస్తున్నారు. ఉద్యోగాల పేరిట మహిళలను ఆ రొంపలోకి దించి, వారితో చేయించరాని పనులు చేయిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది స్పాల్లో వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్నారు. తాజాగా మరోటి హైదరాబాద్ నగరంలో వెలుగుచూసింది.
ఫిలింగన్ రోడ్ నెం.9లోని డీటైప్ క్వార్టర్స్‌లో సిగ్నేచర్ వెల్‌నెస్ స్పా ముసుగులో నిర్వహిస్తున్న వ్యభిచార గృహాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. కె శ్రీనివాస్ అనే వ్యక్తి సిగ్నేచర్ వెల్‌నెస్ స్పా పేరుతో ఓ థెరపీ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు.. స్పా పేరుతో వ్యభిచారం చేస్తున్నారని సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు దాడులు చేశారు. నిర్వాహకుడితో పాటు క్రాస్ మసాజ్ చేస్తున్న యువతులను అదుపులోకి తీసుకున్నారు. మహిళల అక్రమ రవాణాతో పాటు వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లుగా ఈ తనిఖీల్లో తేలింది. ఈజీ మనీ కోసం అలవాటుపడ్డ శ్రీనివాస్ సిగ్నేచర్ వెల్‌నెస్ స్పాను ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల నుంచి యువతులను ఉద్యోగాల పేరిట రప్పించి థెరపిస్ట్‌ల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందింది. ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి స్పాపై దాడి చేసి యువతులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 370, 370ఏ, ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ 1956 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.