ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం అనే లిరిక్ అతడి విషయంలో రుజువైంది. ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. కానీ ఆమె మరో వ్యక్తితో ప్రేమలో పడి.. అతడికి బ్రేకప్ చెప్పింది. ఆమెను విడిచి ఉండలేని ప్రియుడు ఆమె వెంట పడ్డాడు. అతడిని వదిలించుకునేందుకు ఆమె ఏం చేసిందంటే..?
ప్రేమ గుడ్డిదే కాదు.. బానిసత్వానికి, బలహీనతకు కూడా లోనవుతుంది. ప్రేమ వలలో చిక్కుకుపోయి.. ఆ మైకంలో మునిగి తేలిపోతుంటారు ప్రేమికులు. అయితే కొంచెం బెడిసి కొట్టిందా బ్రేకప్ చెప్పేసుకుంటారు. ఇద్దరూ దీని నుండి బయట పడితే.. ఎవరి పనుల్లో వారు బిజీగా గడిపేస్తుంటారు. ఒక్కరు .. దీన్ని అంగీకరించలేకపోతే అసలు సమస్య మొదలవుతుంది. ప్రేమించిన వ్యక్తులను మర్చిపోలేక, వారిని చిత్ర హింసలకు గురిచేయడమో.. లేదంటే వీరు అఘాయిత్యాలకు పాల్పడటమో చేస్తుంటారు. ఇది సాధారణంగా ప్రేమించిన యువతి విషయంలో ప్రేమికుడు చేస్తుంటాడు. కానీ ఇక్కడ సీన్ రివర్స్.. ప్రేమించిన వ్యక్తిని వదిలించుకోవడం కోసం ప్రియుడిని అత్యంత దారుణంగా హింసించిందో సైకో ప్రియురాలు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది.
కేరళలోని ఎర్నాకుళంలోని వర్కాలకు చెందిన లక్ష్మి ప్రియ, అయిరూరుకు చెందిన ఓ యువకుడు గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. అయితే ఎర్నాకుళంలో బీసీఏ చదివేందుకు యువకుడు వెళ్లగా.. లక్ష్మి ప్రియ, మరో యువకుడితో ప్రేమలో పడింది. దీంతో మొదటి లవర్‌కు బ్రేకప్ చెప్పింది. అయితే ఆమెను మర్చిపోలేకపోయిన యువకుడు.. ఆమె వెంట పడటం, పలుమార్లు చాట్ చేశాడు. ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదని భావించిన యువతి ఓ పథకాన్ని రచించింది. బయటకు రావాలని మేసేజ్ చేసింది. అనుకున్నట్లుగానే ముఠాను ఏర్పాటు చేసుకుని కారును సిద్ధం చేసి..అతడు బయటకు రాగానే బలవంతంగా వాహనంలోకి ఎక్కించింది. కారులోనే అతడిపై గూండాలతొో దాడి చేయించింది.
అతడి వద్ద నుండి బంగారం గొలుసు, రూ. 5500, ఐఫోన్ వాచ్ లాగేసుకున్నారు. అనంతరం ఓ ఖాళీ ఇంట్లోకి తీసుకెళ్లి.. కొత్త ప్రియుడితో కలిసి మాజీ ప్రియుడిని కట్టేసి, బట్టలూడ దీసి కొట్టించింది. ప్రియుడు, గూండాలతో కలిసి కొట్టించింది. బీరు తాగేందుకు నిరాకరిస్తే.. బాటిల్‌తో తలపై కొట్టారు. బీరు తాగించి, సిగరెట్లతో శరీరంపై వాతలు పెట్టారు. ఈ ఘటన అంతా వీడియో తీసి పైశాచిక ఆనందం పొందింది లక్ష్మి ప్రియ. అంతే కాకుండా డబ్బులు డిమాండ్ చేసింది. తనను వదిలేయాలని లేకుంటే ఈ వీడియోలు రిలీజ్ చేస్తానంటూ బెదిరించింది. తానేదో ఘనకార్యం చేస్తున్నట్లు ఆ వీడియోలను తన వాట్సప్ స్టేటస్‌లో కూడా పెట్టుకుంది. ఇది గమనించిన స్నేహితులు, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పొద్దున్న తొమ్మిదిన్నరకు తీసుకెళ్లి.. సాయంత్రం ఏడున్నర గంటలకు విడిచిపెట్టేంత వరకు చుక్క మంచి నీరు కూడా ఇవ్వలేదు.
నగ్నంగానే అతడిని రోడ్డుపైన వదిలేశారు. తీవ్ర గాయాలైన అతడిని బంధువులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన కేరళలో పెను సంచలనంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితురాలు లక్ష్మి ప్రియ కోసం గాలించారు. ఆమె పరారవ్వగా..కూజకూతంలోని కూలత్తూరులో అరెస్టు చేశారు. కాగా, లక్ష్మి ప్రియ కూడా బీసీఏ విద్యార్థి. ఆమెతో పాటు ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అమన్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుత ప్రియుడి తో పాటు మరికొంత ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.