అనుమానంతో భార్యాభర్తలు ఒకరిని ఒకరు కించపరచుకోవడం, దుర్భాషలాడుకోవడం, దాడి చేసుకోవడం వంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. అదే ఆలోచనలో పడిపోయి మనశ్శాంతిని పొగొట్టుకుంటున్నారు. చివరకు బిడ్డల ముందు తగాదాలు, గొడవలు, ఘర్షణలు జరుగుతున్నాయి
భార్యభర్తల మధ్య ఏర్పడ్డ కుటుంబ కలహాలు పెను విషాదాలు నింపుతున్నాయి. అనుమానంతో ఒకరిని ఒకరు కించపరచుకోవడం, దుర్భాషలాడుకోవడం, దాడి చేసుకోవడం వంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. అనుమానం పెనుభూతంగా మారింది. మరొకరితో కట్టుకున్న భాగస్వామి అక్రమ సంబంధాలు నెరుపుతున్నారన్న అనుమానం వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అదే ఆలోచనలో పడిపోయి మనశ్శాంతిని పొగొట్టుకుంటున్నారు. చివరకు బిడ్డల ముందు తగాదాలు, గొడవలు, ఘర్షణలు జరుగుతున్నాయి. క్షణికావేశంలో ప్రాణాలు తీస్తున్నారు. ఇదే అనుమానం కారణంగా భార్యతో పాటు అత్తను అతి కిరాతకంగా హత్య చేసేందుకు ప్రయత్నించాడు ఓ భర్త. ఈ దారుణ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
ఎస్సై రాజేష్ , స్థానికుల కథనం ప్రకారం జరిగిన ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పూ గోదావరి జిల్లా పోలవరం మండలం గుత్తినదీవి గ్రామంలో నిచ్చెనకోళ్ల రామకృష్ణకు, మండపేటకు చెందిన యువతికి ఏడేళ్ల కిందటే వివాహం జరిగింది. వారికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. అతడు కొన్నేళ్లుగా కొబ్బరిదింపు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కొంత కాలం వీరి కాపురం సాఫీగా సాగింది. అయితే ఇటీవల అతడి భార్య తరచూ ఫోనులో మాట్లాడుతుండటం చూసి భర్త అనుమానం పెంచుకున్నాడు. ఆమెను పలు మార్లు మందలించాడు. కానీ ఆమెలో మార్పు రాలేదు. శుక్రవారం కూడా అదే పనిగా ఫోనులో మాట్లాడటం చూసి తీవ్ర ఆగ్రహానికి గురి అయ్యాడు. అంతలోనే తన విచక్షణ కోల్పోయి తన కొబ్బరి దింపునకు ఉపయోగించే కత్తితో ఆమెపై ఒక్కసారిగా దాడి చేశాడు.
తన కూతురుని చూసుకోవడానికి వచ్చిన రామకృష్ణ అత్త మేరీ రత్నం కూడా అక్కడే ఉంది. తన కూతురుపై దాడి చేస్తున్న క్రమంలో రామకృష్ణను ఆపే ప్రయత్నం చేసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నిందితుడు రామకృష్ణ అత్తపై కూడా దాడి చేశాడు. అయితే అనంతరం అతడు కూడా ఆత్మాహత్యాయత్నానికి ఒడిగట్టాడు. చీమల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోపోయాడు. ప్రాణపాయ స్థితిలో ఉన్న ఆ ముగ్గురిని గ్రామంలో ఉండే స్థానికులు చూసి 108 లో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ఉన్న దంపతులతో సహా రామకృష్ణ మేరీ రత్నం కూడా ఆసుపత్రి పాలవడంతో చిన్నారులు బిక్కు బిక్కు మంటూ బోరున విలపిస్తున్నారు. అక్కడ జరుగుతున్న సంఘటన స్థలాన్నికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.