అప్పట్లో అతడిని చంపి, చడీ చప్పుడు కాకుండా మృతదేహాన్ని మాయం చేశాడు. 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు కలలో కనిపించి హింసిస్తున్నాడంటూ స్థానికులు చెప్పాడు. వారు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బాలోద్ జిల్లాలో చోటుచేసుకుంది.
నేరాలకు పాల్పడిన వారి నుండి నిజాలు కక్కించేందుకు పోలీసులు తమదైన స్టైల్స్‌లో విచారిస్తుంటారు. కానీ కొన్ని సార్లు విచిత్రమైన కేసులు కూడా చూస్తుంటారు. ఎంతకు నిజాలు చెప్పని వారు కూడా ఉంటారు. లేదంటే నిజాన్ని వక్రీకరించేందుకు అబద్ధాలను చెబుతుంటారు. లేదా వింత వాదనలు విని ఉంటారు. అయితే పోలీసుల వద్దకు ఇప్పుడొక విచిత్రమైన కేసు వచ్చింది. ఎప్పుడో 20 ఏళ్ల నాడు ఓ హత్య జరగ్గా.. ఇప్పుడు అతడు కలలోకి వచ్చి తనను వేధిస్తున్నాడు అంటూ ఓవ్యక్తి గగ్గోలు పెట్టాడు. ఈ విచిత్రమైన ఫిర్యాదుతో పోలీసులు సైతం అవాక్కయ్యారు. అయితే ఇందులో మరో ట్విస్టు కూడా ఉండటం విశేషం.
అదేంటంటే.. కపేలలో కనిపించిన వ్యక్తిని హత్య చేసిందీ.. అతడే. అప్పట్లో అతడిని చంపి, చడీ చప్పుడు కాకుండా మృతదేహాన్ని మాయం చేశాడు. 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు కలలో కనిపించి హింసిస్తున్నాడంటూ స్థానికులు చెప్పాడు. వారు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బాలోద్ జిల్లాలో చోటుచేసుకుంది. కర్కాభాట్ గ్రామానికి చెందిన టికం కొలియారా అనే వ్యక్తి 2003లో ఛబేశ్వర్ గోయల్ అనే వ్యక్తిని హత్య చేశాడు. దాదాపు 20 ఏళ్ల తర్వాత తాను ఛబేశ్వర్‌ను హత్య చేశానంటూ గత ఏడాది గ్రామస్థులకు చెప్పాడు. అతడు తన భార్య స్నేహితుడని, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడంతో చంపేసి, మృతదేహాన్ని అడవిలో పాతిపెట్టినట్లు తెలిపాడు.
దీంతో గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు కొలియారాను అరెస్టు చేశారు. ఐతే కొలియారా చెప్పిన ఆధారాల ప్రకారం మృతదేహాన్ని పాతిపెట్టిన స్థలంలో తవ్వగా.. వారికి ఎటువంటి మృతదేహం లభించలేదు. దీంతో కొలియారా మానసిక ఆరోగ్యం బాగాలేదని పోలీసులు అతన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కానీ ఛబేశ్వర్ తండ్రి మాత్రం తన కొడుకు గత కొంతకాలంగా కనిపించడం లేదంటూ, ఆ ప్రాంతంలో మళ్లీ తవ్వకాలు జరపాలంటూ అధికారులను ఆశ్రయించాడు. దీంతో అధికారులు బుధవారం మరోసారి తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలో డ్యామ్ పక్కన కొన్ని ఎముకలు, వస్త్రాలను గుర్తించారు. డీఎన్‌ఏ పరీక్షల కోసం వాటిని ల్యాబ్‌కు పంపినట్లు ఏఎస్పీ హరీశ్ రాథోడ్ మీడియాకు తెలిపారు.