భార్య మరొకరితో చనువుగా ఉన్న, పరాయి పురుషుడితో మాట్లాడినా భరించలేని భర్త.. ఆమెపై అనుమానం పెంచుకుంటున్నాడు. దీని కారణంగా ఇంట్లో గొడవలు మొదలయ్యి మనశ్శాంతిని దూరం చేసుకుంటున్నారు. ఇక ఆమె ఏం చేసినా భర్తకు నచ్చదు.
ఈ రోజుల్లో జరుగుతున్న కొన్ని దారుణాలు గురించి వింటుంటే ఆశ్చర్యపోయడంతో పాటు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా భార్య, భర్తల మధ్య బంధంలో ఏర్పడుతున్న పొరపచ్ఛాలు తీవ్ర స్థాయికి తీసుకు వెళుతున్నాయి. చిన్న చిన్న విషయాలకే అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు కొందరు. భార్య మరొకరితో చనువుగా ఉన్న, పరాయి పురుషుడితో మాట్లాడినా భరించలేని భర్త.. ఆమెపై అనుమానం పెంచుకుంటున్నాడు. దీని కారణంగా ఇంట్లో గొడవలు మొదలయ్యి మనశ్శాంతిని దూరం చేసుకుంటున్నారు. ఇక ఆమె ఏం చేసినా భర్తకు నచ్చదు. బంధువులతో కలిసి భార్య డ్యాన్స్ వేయడాన్ని భరించలేని భర్త ఆమెపై దాడికి దిగిన సంఘటన చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
కుమారుడి పెళ్లిలో సోదరులు, బంధువులతో కలిసి భార్య డ్యాన్స్ చేసిందని ఆమెపై దాడికి దిగాడు భర్త. విస్తు పోయే ఈ సంఘటన చత్తీస్ గఢ్ లోని కబీర్ ధామ్ జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కవర్థ పరిధి బంగౌరా గ్రామంలో తిన్హా బైగా అనే వ్యక్తి కుమారుడి వివాహం ఇటీవల జరిగింది. అయితే ఈ వేడుకల్లో వచ్చిన బంధువులు డ్యాన్సులు చేస్తున్నారు. అదే సమయంలో తిన్హా బైగా భార్య కూడా డ్యాన్స్ చేస్తోంది. మరుదులు, బంధువులతో డ్యాన్స్ చేయడాన్ని చూసిన భర్త.. తాగిన మత్తులో కత్తి తీసుకుని ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన అతడి సోదరులు అడ్డుకునేందుకు వెళ్లగా.. వారిని హత్య చేశాడు.
అదే కత్తితో మరో సోదరుడు, బావపై కూడా కత్తితో దాడి చేశాడు. వారిద్దరూ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా.. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని చంపి ఏమీ ఎరగన్నట్లు మంచంపై హాయిగా నిద్రపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. నిందితుడ్ని అరెస్టు చేశారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.