భార్యను కాదని మరో స్త్రీతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్న వ్యక్తి ఆమెనే ప్రపంచం అని బతికేస్తుంటారు. వారితో ఫోన్లు, ఇకఇకలు, పకపకలు, పక్కా అన్ని పంచుకుంటాడు. భార్య విషయానికి వస్తే.. భర్త అర్థం చేసుకోవడం లేదని.. పరాయి పురుషుడు చెప్పే నాలుగు మంచి మాటలకు లొంగిపోతుంది. లేదా భర్త తెచ్చే డబ్బులు చాలక, లేదంటే అందంగా లేదని ఇతర కారణాలతో భర్తకు తెలియకుండా వివాహేతర సంబంధాలు నెరుపుతున్నారు. ఇదే ఆ వ్యక్తి కొంపముచ్చింది.
భార్యా భర్తల సంబంధాల్లో మూడో వ్యక్తి ప్రమేయం కారణంగా ఆ సంసారం విచ్ఛిన్నమవుతుంది. పరాయి స్త్రీ, పురుషుల మోజులో భర్త లేదా భార్య పడి కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. భార్యను కాదని మరో స్త్రీతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్న వ్యక్తి ఆమెనే ప్రపంచం అని బతికేస్తుంటారు. వారితో ఫోన్లు, ఇకఇకలు, పకపకలు, పడక సుఖం, అన్ని పంచుకుంటాడు. అతడి కోసం ఎదురుచూసే భార్య, బిడ్డలను మర్చిపోతాడు. కనీసం వారిని సాకాలన్న ఆలోచనను కోల్పోతుంటాడు భర్త. భార్య విషయానికి వస్తే.. భర్త అర్థం చేసుకోవడం లేదని.. పరాయి పురుషుడు చెప్పే నాలుగు మంచి మాటలకు లొంగిపోతుంది. లేదా భర్త తెచ్చే డబ్బులు చాలక, లేదంటే అందంగా లేదని ఇతర కారణాలతో భర్తకు తెలియకుండాయ మరొకరితో వివాహేతర సంబంధాలు నెరుపుతున్నారు. ఇటీవల కాలంలో జరుగుతున్న దారుణాలన్నీ దీని చుట్టూనే తిరుగుతున్నాయి.
ప్రేమించి..పెళ్లి చేసుకున్న భార్య.. మరొకరిపై మోజు పడుతుందని తెలుసుకున్న భర్త.. తమ మధ్యకు వచ్చిన వ్యక్తిని అతి కిరాతకంగా నరికి చంపిన ఘటన కర్ణాటకలో జరిగింది. వివరాల్లోకి వెళితే..బెంగళూరు రూరల్ జిల్లా దేవనహళ్లి తాలూకాలోని సింగ్రహళ్లి గ్రామానికి చెందిన ప్రదీప్.. అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఆమె భర్త వెంకటేష్‌కు తెలిసిపోయింది. తమది ప్రేమ వివాహం అయినా.. భార్య మరొకరిపై మనస్సు పడిందని తెలుసుకుని భరించలేకపోయాడు భర్త. ఈ పంచాయతీ పోలీసుల వద్దకు చేరింది. పోలీసులు రాజీ కుదిర్చి, కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. కొన్నాళ్లు సవ్యంగానే సాగిపోయినా.. మళ్లీ వీరిద్దరూ కలవడం మొదలు పెట్టారు. ఈ విషయం తెలిసిన భర్త కోపంతో ఊగిపోయాడు.
ఈ సారి ప్రదీప్ అంతు చూడాలని భావించాడు. ఈ నేపథ్యంలో అతడితో మాట్లాడాలని పిలిపించాడు. బుధవారం రాత్రి ప్రదీప్‌ను బయటకు పిలిచిన వెంకటేష్.. తన వెంట తెచ్చుకున్న కత్తులతో పొడిచి దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రదీప్ రక్తం కారుతున్నప్పటికీ.. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగెట్టాడు. అయినా వారు విడిచి పెట్టలేదు. కత్తులలో వెంటడి, కొట్టి చంపారు. అనంతరం అక్కడి నుండి పారిపోయారు దుండగులు. ఘటనా స్థలిని పోలీసులు పరిశీలించారు. ప్రదీప్‌ను చంపింది మహిళ భర్త వెంకటేష్, మరో వ్యక్తి అయి ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.