భర్త మరో మహిళతో మాట్లాడినా, చూసినా అనుమానం పెంచుకుంటోంది భార్య. అలాగే ఉద్యోగం ఇతర కారణాలతో బయటకు వెళుతున్న భార్యను అనుమానంతో వేధిస్తున్నాడు భర్త. ఇవే అనుమానాలు చివరకు ప్రాణాలు తీస్తున్నాయి.
ఇటీవల కాలంలో వైవాహిక జీవితం బీటలు వారుతున్నాయి. అనుమానంతో భార్యా, భర్తల మధ్యల మధ్య గొడవలు పెను విపత్తుకు దారి తీస్తున్నాయి. భర్త మరో మహిళతో మాట్లాడినా, చూసినా అనుమానం పెంచుకుంటోంది భార్య. అలాగే ఉద్యోగం ఇతర కారణాలతో బయటకు వెళుతున్న భార్యను అనుమానంతో వేధిస్తున్నాడు భర్త. అనుకోకుండా ఒకరితో మాట్లాడుతూ కనిపించినా.. అతడితో ఎఫైర్ అంటగట్టి.. ఆమెపై మానసికంగా, శారీరకంగా దాడి చేస్తున్నాడు. భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతోనే భర్త.. అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఆసీఫాబాద్ జిల్లా వాంకిడి మండలం దాబా గ్రామానికి చెందిన వడాయి మారుతి, సంగీత దంపతులు. వీరికి 2015 లో పెళ్లయింది. వీరికి ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. ఆ దంపతులిద్దరు కూలీ పనులు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు. అయితే భార్య మరొకరితో అక్రమ సంబంధం నెరుపుతుందని భావించిన భర్త మారుతి తాగుడుకు బానిసయ్యాడు. రోజు తాగొచ్చి ఆమెతో గొడవ పడేవాడు. శనివారం కూడా రోజు లాగానే సంగీతతో గొడవ పడ్డాడు. అంతటితో ఆగకుండా తన ఆవేశాన్ని తట్టుకోలేక ఇంట్లో ఉన్న గొడ్డలితో ఆమె తలపై నరికాడు. దానితో సంగీత తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే చనిపోయింది.
ఆ గొడవ జరుగుతున్న సమయంలో గ్రామంలో ఉండే మొర్లె పొచ్చు అనే వ్యక్తి గొడవను ఆపడానికి ఆ ఇంటికి వచ్చాడు. అతడిపై కూడా దాడి చేశాడు. అతని మెడపై, తన ఎడమ చేతిపై నరికాడు. దాంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడ ఉన్న స్థానికులు గమనించి అతన్ని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నారు. దీంతో మృతురాలి తండ్రి లెండిగురే బాబాజీ ఘటనా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు చేపడుతున్నారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.