వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉంటున్న భార్య లేదా భర్తను కడతేరుస్తున్నారు కట్టుకున్న వారు . తాము కామ వాంఛ కోసం బిడ్డల్ని సైతం పొట్టనపెట్టుకుంటున్నారు కొందరు. తాజాగా ఓ వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన తెలంగాణలోని చోటుచేసుకుంది.
వివాహ సంబంధానికి అక్రమ సంబంధాలు తూట్లు పొడుస్తున్నాయి. పెళ్లై.. కొన్నాళ్లు కాపురం చేశాక భాగస్వామి పట్ల విరక్తో, పక్క వాళ్లమోద ఆసక్తో తెలియదు కానీ.. పరాయి వ్యక్తుల మోజులో పడుతున్నారు. రహస్యంగా, చాటుమాటుగా వ్యవహారం కానిస్తున్నారు. దొరికితే దొంగ, దొరక్కపోతే దొర అన్నచందంగా వీరి యవ్వారం సాగిపోతూంటుంది. బయట పడితే భార్య, భర్తల్లో ఒకరి అంతు తేలాల్సిందే. లేదంటే వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉంటున్న భార్య లేదా భర్తను కడతేరుస్తున్నారు. తామ కామ వాంఛ కోసం బిడ్డల్ని సైతం పొట్టనపెట్టుకుంటున్నారు కొందరు. తాజాగా ఓ వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన తెలంగాణలోని చోటుచేసుకుంది.
ఆదిలాబాద్ జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. అందులో ఒకరు వివాహిత కాగా, మరొకరు యువకుడు. అత్యంత కిరాతకంగా వీరిని కొట్టి చంపారు. గుడి హత్నూర్ మండలం సీతగొంది గ్రామ శివారులో వ్యవసాయ భూమిలో ఈ మృతదేహాలను కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. వీరిని ఆదిలాబాద్ నగరంలోని భూక్తాపూర్‌కు చెందిన మహ్మద్ రఫిక్, కేఆర్కే నగర్ ప్రాంత వాసి అశ్వినీలుగా గుర్తించారు. కాగా, రఫిక్ అలియాస్ రెహమాన్‌కు 20 ఏళ్లు కాగా, అశ్వినీకి 28 ఏళ్లు. వీరిద్దరి మధ్య ఎప్పటి నుండో ప్రేమ వ్యవహారం నడుస్తుందిని తెలుస్తోంది. డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు విచారణ చేపట్టారు. ఎవరు హత్యచేశారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అశ్వినీ కొన్ని రోజుల నుండి భర్త రమేష్‌కు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. అయితే ఓ కీలక ఆధారం పోలీసులకు లభ్యమైంది.
ఈ హత్యకు గురైన జంట ద్విచక్రవాహనంపై వెళుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. వారిద్దరి తలపై బండరాయితో మోదీ కిరాతకంగా హత్య చేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అదేవిధంగా హత్య చేసిన వాళ్లకు సంబంధించిన ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. కారులో వచ్చి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుల కారు విజువల్స్ సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. అయితే ఆమె భర్త హత్య చేసుకుంటాడన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. అయితే భర్త రమేష్ పోలీసుల ఎదుట లొంగిపోయాడని తెలుస్తోంది. భార్య వివాహేతర సంబంధం గురించి తెలిసి.. వీరిద్దరిని హత్య చేసినట్లు నేరం అంగీకరించాడని సమాచారం.