తెలంగాణ లో సంచలన సృష్టించిన వరంగల్ మెడికల్ స్టూడెంట్ ప్రీతి హత్య కేసుకు సంబంధించి సీపీ రంగనాథ్ కీలక విషయాలు వెల్లడించారు. సైఫ్ ర్యాగింగ్ వల్లే ప్రీతి చనిపోయిందని నిర్ధారించినట్లు వెల్లడించారు. అయితే ప్రీతిని సైఫ్ హత్య చేసినట్లు ఆధారాలు లేవని అన్నారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన మెడికో ప్రీతి కేసులో కీలక విషయాలు వెల్లడించారు వరంగల్ పోలీసు కమిషనర్ రంగనాథ్. ప్రీతి కేసును లోతుగా విచారణ చేస్తున్నామని సీపీ రంగనాథ్ తెలిపారు. ప్రెస్ మీట్ లో భాగంగా ఆయన ప్రీతి మృతికి సంబంధించి కీలక విషయాలు బయటపెట్టారు. ప్రీతిది హత్య అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని.. హత్య కోణంలో విచారించినప్పుడు ఎలాంటి ఆధారాలు లభించలేదని అన్నారు. అయితే పోస్టుమార్టం రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నామని, పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే ప్రీతిది ఆత్మహత్యనా? లేక కార్డియాక్ అరెస్టా? అనేది తేలుతుందని అన్నారు. ప్రీతి విషయంలో ర్యాగింగ్ జరిగినట్లు నిర్ధారణ అయ్యిందని.. ర్యాగింగ్ ను కాజ్ ఆఫ్ డెత్ గా నిర్ధారించమని అన్నారు.
సైఫ్ ర్యాగింగ్ చేయడం వల్లే ప్రీతి చనిపోయినట్లు నిర్ధారించామని సీపీ రంగనాథ్ అన్నారు. ఈ కేసులో సైఫ్ కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా సాక్ష్యాధారాలు సేకరిస్తున్నామని అన్నారు. అన్ని ఆధారాలతో నిందితులకు శిక్షపడేలా చూస్తామని అన్నారు. ఈ కేసులో సైఫ్ తో పాటు ఒకరిద్దరు ఉన్నట్లు తెలిసిందని.. వారిని పట్టుకునేందుకు ఆధారాలు సేకరిస్తున్నామని సీపీ రంగనాథ్ వెల్లడించారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.