కొన్ని విషయాలు వినడానికి కూడా జుగుబ్సాకరంగా ఉంటాయి. ఇది కూడా ఆ కోవకు చెందిందే. సమాజంలో మహిళలు, పిల్లలు, పసికందుల మీదనే కాదు.. మూగజీవాలపై కూడా అత్యాచారాలు, ఆగడాలు పేట్రేగిపోతున్నాయి. అవి ఏ స్థాయిలో ఉన్నాయంటే మూగజీవాల బాధ చూడలేక రైతులు వాటిని అమ్ముకునే దాకా వెళ్లింది. ఇదంతా ఎక్కడో కాదు అత్యధికంగా చదువుకున్న వాళ్లున్న కేరళ రాష్ట్రంలో జరిగింది. అసలు విషయాలు తెలుసుకుని అందరూ ఛీపాడు వీళ్లకేం పోయేకాలం అంటూ తిట్టుకుంటున్నారు.
కేరళ రాష్ట్రం కొల్లం జిల్లాలోని మయనాడ్ ప్రాంతంలో ఈ అత్యంత అమానవీయ ఘటనలు జరుగుతున్నాయి. రాత్రిపూట ఇంటి ముందు కట్టేసిన ఆవులపై అత్యాచారానికి పాల్పడటే కాదు.. వాటిని విచక్షణారహితంగా కొడుతున్నారు, హింసిస్తున్నారు. ఎవరు చేస్తున్నారో తెలీదు, ఎందుకు అలా జరుగుతుందో తెలీక రైతులు ఆ మూగజీవాల బాధ చూడలేక వాటిని వేరే వారికి అమ్మేయడానికి సిద్ధమైపోయారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరా ఏర్పాటు చేయగా షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. ఇది అంతా ఏదో ఒక్క రైతు ఆవులకే కాదు దాదాపు 20 మంది రైతులకు చెందిన ఆవులపై అత్యాచారం జరిగింది. అంతేకాదు వాటిని కొట్టడం పాలిచ్చే పొదుగును రాళ్లతో కొట్టడం. జననాంగాలలో కట్టెలు పెట్టడంలాంటి ఎంతో అమానవీయంగా, అత్యంత క్రూరంగా ప్రవర్తించారు.
మొదట ఇదంతా ఎవరో కావాలని కక్షతో చేస్తున్నారని భావించారు. అసలు ఎందుకు అలా చేస్తున్నారన్న విషయాన్ని కనుక్కోలేకపోయారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకరోజు రాత్రి అందరూ కలిసి అలాంటి పనులు చేస్తున్న ఒకవ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కానీ, అతను మతిస్థిమితంలేని వ్యక్తిగా తేలింది. వాటంతటికి అతనే కారణమా? ఇంకా ఈ ఘటనల వెనుకాల ఎవరైనా ఉన్నారా? అన్న అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, చుట్టుపక్కల ప్రాంతంవారు ఛీ ఇదేం పనంటూ ఆగ్రహావేశాలకు గురవుతున్నారు. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.