నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందిన శ్యామల ముత్తయ్య అనే వ్యక్తికి నరసింహ అనే కుమారుడు ఉన్నాడు. ఇక తండ్రి ముత్తయ్యతో పాటు కుమారుడు నరసింహ బాతుల పెంపకాన్ని నడిపిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇక కుమారుడు నరసింహకు కొన్నాళ్ల కిందట శైలజ అనే యువతితో వివాహం జరిగింది. కొంత కాలం వీరి వివాహ జీవితం బాగానే సాగింది. కానీ భర్తకు తెలియకుండా శైలజ మహేశ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని నడిపిస్తుంది.
కొంత కాలం నుంచి భార్య శైలజ ఈ సంసారాన్ని గుట్టుచప్పుడు కాకుండా నడిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే భర్త నరసింహ కరీంనగర్ లో ఉంటున్న తన సొంత అక్క ఇంటికి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన భార్య శైలజ ప్రియుడు మహేశ్ ను ఇంటికి పిలుపించుకుంది. ప్రియుడితో పాటు శైలజ ఇంట్లో ఉండటం చూసిన మామ ముత్తయ్య ఒక్కసారిగా కోపాద్రిక్తుడయ్యాడు. ఈ క్రమంలో కోడలు శైలజ, మామ మధ్య కాసేపు గొడవ కూడా జరిగింది. దీంతో ఈ విషయాన్ని మామ బయటకు ఎక్కడ చెబుతాడోనని భావించిన కోడలు శైలజ ప్రియుడి సాయంతో మామను ఊపిరాడకుండా చేసి చంపేసింది.
దీంతో ఇదే విషయాన్ని భర్తకు చెబుతూ మీ నాన్న గుండెపోటుతో మరణించాడని నమ్మబలికింది. ఇంటికి చేరుకున్న భర్త నరసింహ తండ్రి ముత్తయ్య ముఖంపై కొట్టినట్లు గాయాలు కనిపించటంతో కాస్త అనుమానం వచ్చింది. ఇక వెంటనే నరసింహ పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇక చివరికి మామ హత్యలో కోడలితో పాటు ప్రియుడి పాత్ర ఉండటంతో పోలీసులు శైలజను అరెస్ట్ చేశారు. దీంతో పాటు ప్రియుడు మహేష్ ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.