Hyderabad Crime: కొందరు కామాంధులు తమ కామ కోర్కెలను తీర్చుకోవటానికి దేన్నీ వదలటం లేదు. పార్కులు, లాడ్జీలు, పాడు బడ్డ ఇళ్లు, చెట్లు, పుట్టలు, కొండ గట్టులు… ఇప్పుడు ఇవేవీ చాలటం లేదన్నట్లు అద్దె ఇళ్లపై పడ్డారు. టూ లెట్ బోర్డు పెట్టిన ఇళ్లను ఎంచుకుని, వాటిలో అద్దెకు దిగే నెపంతో తమ పని కానిస్తున్నారు. ఓ జంట ఇందుకు ట్రెడ్ సెట్టర్‌గా మారింది. అద్దె ఇళ్లు చూస్తామని వెళ్లి, గదిలో శృంగారం మొదలుపెట్టింది. ఇళ్లు చూడ్డానికి వెళ్లిన వాళ్లు ఎంతకీ బయటకు రాకపోవటంతో ఇంటి యజమాని ఇంట్లోకి వెళ్లాడు. లోపల వాళ్లు చేస్తున్న పని చూసి షాక్ అయ్యాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్, ఎస్సార్‌నగర్, బీకే గూడలోని ఓ ఇంటికి టూ లెట్ బోర్డు పెట్టి ఉంది. ఓ జంట ఆ బోర్డును చూసి, ఇంటి యజమానికి ఫోన్ చేసింది. యజమాని ఆ ఇంటి దగ్గరకు వచ్చాడు. కీ ఇచ్చి ఇళ్లు చూసుకోమని చెప్పాడు. ఆ జంట రెండవ అంతస్తులో ఉన్న ఇంట్లోకి వెళ్లింది.
అయితే, ఇంటిని చూడ్డానికి వెళ్లిన ఆ జంట ఎంత సేపటికి తిరిగిరాకపోవటంతో యజమాని పైకి వెళ్లాడు. ఇంటి తలుపు తీసి లోపలకు వెళ్లాడు. లోపల ఆ జంట అభ్యంతరకర స్థితిలో ఉండటం చూసి షాక్ అయ్యాడు. వారిపై కోపంతో కేకలు వేశాడు. అంతే! ఆ జంట అక్కడినుంచి కిందకు పరుగులు తీసింది. ముందు యువతి, ఆమె వెనకాల యువకుడు పరుగులు తీశారు. కిందకు వచ్చిన తర్వాత యువకుడు తీసుకువచ్చిన బైక్‌పై ఉడాయించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఫుటేజీల ఆధారంగా ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Students Crime: వైరల్ వీడియో: బస్టాండ్‌లో దారుణంగా కొట్టుకున్న బాలికలు