బాధ్యత గల వృత్తిలో ఉన్న కొందరు పోలీసు అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. అడ్డు అదుపు లేకుండా వ్యవహరిస్తూ పోలీస్ వృత్తికే మచ్చ తెస్తున్నారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళల ఎఫైర్స్ పెట్టుకోవడం, కోరిక తీర్చకపోతే వేధించడం వంటి ఘటనలు గతంలో మనం అనేకం చూశాం. అయితే, అచ్చం ఇలాంటి ఘటననే తాజాగా రాజస్థాన్ లో చోటు చేసుకుంది. ఇద్దరు కానిస్టేబుళ్లు గదిలోకి ఓ మహిళను తీసుకెళ్లి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ రొమాన్స్ చేశారు. అంతేకాకుండా ఇదంతా సెల్ ఫోన్ లో వీడియో కూడా తీసుకున్నారు. ఇదే వీడియో వైరల్ గా మారి చివరికి పోలీసుల ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్ ఉదయ్ పూర్ పరిధిలోని లసాడియా పోలీస్ స్టేషన్ లో లోకేష్ కుమార్, సురేంద్ర సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. కానీ, ఈ అధికారులు పోలీసు వృత్తికే మచ్చ తెచ్చే పని చేశారు. ఏకంగా ఓ మహిళను మొగ్గులోకి దించుకున్నారు. అంతేకాకుండా ఆమెను గదిలోకి తీసుకెళ్లి ఆమెతో రొమాన్స్ కు తెర లేపారు. వీరిద్దరితో పాటు ఓ లాయర్ కూడా ఉన్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఆ మహిళతో సరసాలకు దిగి వీడియో కూడా తీసుకున్నారు. అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారి చివరికి పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీనిపై స్పందించిన అధికారులు వెంటనే లోకేష్ కుమార్, సురేంద్ర సింగ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాధ్యత గల వృత్తిలో ఉండి పరాయి మహిళతో రొమాన్స్ కు తెర లేపిన ఈ కానిస్టేబుళ్ల వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మహిళతో కానిస్టేబుళ్లు ఏం చేస్తున్నారో చూడండి! pic.twitter.com/ESoTYtFjw3
— venky bandaru (@venkybandaru13) June 1, 2023