ఇప్పుడు చెప్పుకోబోయే కేసు ఎంతో సంచలనమైనది. ఈ కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. తీర్పు చెప్పిన న్యాయమూర్తి సైతం భావోద్వేగానికి లోనయ్యేలా చేసింది. ఇద్దరు తల్లీకూతుళ్లు చేసిన పనికి యావత్ ప్రపంచమే నివ్వెరపోయింది. వాళ్లు మొత్తం 560 మంది శరీర భాగాలను మోసపూరితంగా అమ్ముకుని డబ్బులు దండుకున్నారు. కేసు నిరూపితమైన తర్వాత న్యాయస్థానం వారికి కఠిన శిక్ష విధించింది. కుమార్తెకు 20 ఏళ్ల జైలుశిక్ష విధించగా.. తల్లికి 15 ఏళ్ల జైలుశిక్ష విధించారు. ఆ కేసు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మేగన్ హెస్ అనే మహిళకు అమెరికాలోని కొలరాడో మోంట్రాస్ లో సన్ సెట్ మేసా అనే అంత్యక్రియలు నిర్వహించే ఓ ప్రదేశం ఉంది. వారే అవయవాల దానం చేసే కార్యక్రమాలను కూడా నిర్వహించేవారు. అక్కడ ఎంతో మంది తమ ఆత్మీయులకు అంతిమ సంస్కారాలు నిర్వహించుకున్నారు. వారు అక్కడ అంత్యక్రియలు నిర్వహించినందుకు వారి వద్ద దాదారు వెయ్యి డాలర్లు వసూలు చేసేవాళ్లు. అయితే వారికి తెలియకుండానే మృతదేహాల నుంచి భాగాలను విడదీసి మెడికల్ రీసెర్చ్ కంపెనీలుకు విక్రయించుకునేవారు.
వాళ్లకి ఫోర్జరీ సంతాకలతో డోనర్ లెటర్స్ ను పంపేవాళ్లు. మెడికల్ రీసెర్ట్ వాళ్లు వారికి తెలియకుండానే అక్రమ అవయవాలను కొనుగోలు చేసేవారు. ఇలా దాదాపు 2010 నుంచి 2018 వరకు వీరి దందా సాగింది. మేగన్ హెస్ ఒక్కోసారి పూర్తి మృతదేహాలను కూడా విక్రయించేది. మృతుల కుటుంబాలకు వేరే వేరే శరీర భాగాలు కలిపిన అస్థికలను అప్పజెప్పేది. అమెరికాలో ఆర్గాన్స్ డొనేట్ చేయచ్చు.. కానీ, విక్రయించేందుకు వీల్లేదు. ఈ అక్రమ వ్యాపారంపై 2016-18 మధ్యకాలంలో రాయిటర్స్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2018లో మేగన్ హెస్ తన నేరాన్ని అంగీకరించింది.
అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన కేసుగా మేగన్ హెస్ కేసును అభివర్ణించారు. ఎఫ్ బీఐకి రాయిటర్స్ అందించిన సమాచారంతో వారి కేద్రాలపై దాడులు నిర్వహించారు. మేగన్ హెస్, ఆమె తల్లి షిర్లె కొచ్ తమ నేరాన్ని అంగీకరించారు. మేగన్ హెస్ కి 20 ఏళ్ల జైలు, షిర్లె కొచ్ కు 15 ఏళ్ల జైలుశిక్ష విధించారు. ఈ కేసులో బాధితులు ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. వారికి శిక్ష పడటాన్ని చూసేందుకు ఈరోజు న్యాయస్థానానికి వచ్చామంటూ వ్యాఖ్యానించారు. తీర్పు చెప్పిన న్యాయమూర్తి కూడా భావోద్వేగానికి లోనవ్వడం చూస్తేనే అర్థమవుతుంది ఇది ఎలాంటి కేసు అనేది.
This afternoon, a federal judge in Grand Junction sentenced Megan Hess to 20 years in prison and Shirley Koch to 15 years in prison after their guilty pleas in the Sunset Mesa case. pic.twitter.com/BpdAwEDKnU
— FBI Denver (@FBIDenver) January 4, 2023