Crime News: పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తాలో దారుణం చోటుచేసుకుంది. ఓ సీఐఎస్‌ఎఫ్ జవాన్ మ్యూజియంలో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ పోలీసు చనిపోగా మరో పోలీసు తీవ్రంగా గాయపడ్డాడు. శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కలకత్తా, పార్క్ స్ట్రీట్‌లోని మ్యూజియంలో ఓ సీఐఎస్‌ఎఫ్ జవాన్ 2019నుంచి విధులు నిర్వర్తిస్తున్నాడు. శనివారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో సదరు జవాన్ ఓ సీఐఎస్‌ఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్‌పై తన ఏకే-47 గన్‌తో కాల్పులు జరిపాడు.
మొత్తం 15 రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో సబ్ ఇన్‌స్పెక్టర్ అక్కడికక్కడే మరణించాడు. కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు బలగాలను అక్కడికి పంపారు. బలగాలు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలా జవాన్ ఎందుకు వారిపై కాల్పులు జరిపాడన్న దానిపై విచారణ చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : కంట తడి పెట్టిస్తున్న NRI మహిళ చివరి సెల్ఫీ వీడియో!