ఆమెకు పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త అనారోగ్యంతో గతేడాది కన్నుమూశాడు. ఈ క్రమంలోనే ఓ 50 ఏళ్ల వ్యక్తి ఆ మహిళకు దగ్గరయ్యాడు. నేనున్నానంటూ భరోసానిచ్చాడు. అలా వీరి బంధం చివరికి వివాహేతర సంబంధంగా రూపుదాల్చింది. అయితే ఇటీవల ఓ రోజు ఏం జరిగిందంటే?
ఆమెకు పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి పిల్లల పెళ్లిళ్లు కూడా జరిగిపోయాయి. అంతా బాగానే ఉందనుకున్న తరుణంలోనే ఆమె భర్త అనారోగ్యంతో గతేడాది కన్నుమూశాడు. భర్త మరణాన్ని తట్టుకోలేక ఆ మహిళ తరుచు బాధపడింది. ఈ క్రమంలోనే ఓ 50 ఏళ్ల వ్యక్తి ఆ మహిళకు దగ్గరయ్యాడు. నేనున్నానంటూ భరోసానిచ్చాడు. అలా వీరి బంధం చివరికి వివాహేతర సంబంధంగా రూపుదాల్చింది. అప్పటి నుంచి ఇద్దరు సమయం దొరికినప్పుడల్లా శారీరకంగా కలుస్తూ వచ్చారు. అయితే ఇటీవల ఇద్దరూ మేకలను తీసుకుని అడవికి వెళ్లారు. అక్కడికి వెళ్లాక ఏం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా శేషాపురం యానాది కాలనీలో కస్తూరి (45) అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు గతంలో వివాహమై ఓ కూతురు, ఇద్దరు కుమారులు జన్మించారు. కూతురు గతంలోనే మరణించింది. ఇక ఇద్దరి కుమారులకు పెళ్లిళ్లు అయి వారికి పిల్లలు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే కస్తూరి భర్త గతేడాది అనారోగ్యంతో కన్నుమూశాడు. దీంతో అప్పటి నుంచి భర్తను తలుచుకుంటూ కస్తూరి తరుచు బాధపడుతూ ఉండేది. ఈ క్రమంలోనే స్థానికంగా ఉండే రాములు (50) అనే వ్యక్తి కస్తూరికి దగ్గరయ్యాడు. అలా వీరి బంధం రాను రాను వివాహేతర సంబంధంగా మారింది. వీరిద్దరికి మేకలు ఉండడంతో రోజూ అడవికి వెళ్లి మేకలను మేపుకుని తిరిగి ఇంటికి వచ్చేవారు.
ఇక వీరిద్దరూ సమయం దొరికినప్పుడల్లా శారీరకంగా కలుసుకుంటూ వచ్చారు. కానీ, రాములుకు మాత్రం తన ప్రియురాలు కస్తూరిపై కాస్త అనుమానం బలపడింది. ఆమె మరొక మగాడితో మాట్లాడుతుందని అనుమానించడం మొదలు పెట్టాడు. ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగినట్లు తెలుస్తుంది. అయితే వీరిద్దరూ ఎప్పటిలాగే సోమవారం కూడా మేకలను తీసుకుని అడవిలో వెళ్లారు. నీకు పరాయి మగాళ్లతో సంబంధం ఉందని రాములు కస్తూరిని నిలదీశాడు. ఇదే విషయంపై ఇద్దరు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇక కోపంతో ఊగిపోయిన రాములు.. చేతిలో ఉన్న ఆయుధంతో కస్తూరిని దారుణంగా హత్య చేశాడు.
అయితే రాత్రి అయిన కస్తూరి ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు గ్రామంలోని పొలాల్లో వెతకగా.. ఆ మహిళ ఓ చోట శవమై కనిపించింది. ఈ సీన్ చూసిన ఆమె కొడుకులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టగా.. నిందితుడు రాములు అని తేలింది. అతడు నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.