మనం బాగా బాగా ఎంజాయ్ చేయలేకపోతున్నాం, సంతోషంగా ఉండలేకపోతున్నాం. మనకు ఏ అడ్డు లేకుండా సంతోషంగా ఉండాలంటే.. ముందుగా నా భర్తను ప్రాణాలతో లేకుండా చేయాలి. అప్పుడైతేనే మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు అని ఓ పెళ్లైన మహిళ తన ప్రియుడికి చెప్పిన మాటలు ఇవి. తాళికట్టిన భర్తను కాదని ప్రియుడితో జతకట్టి ఏకంగా భర్త హత్యకు ఉరితాడింది ఈ కిలాడి లేడీ. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలో అసలేం జరిగిందనేది తెలుసుకోవాలనుందా? అయితే మీరు ఈ స్టోరీని చదవాల్సిందే. చిత్తూరు జిల్లా బాలాజీనగర్ కాలనీలో వడివేలు, సెల్విరాణి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గత కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల వైవాహిక జీవితం బాగానే సాగుతూ వచ్చింది.
పెళ్లైన కొంత కాలానికి భర్త ఆటో డ్రైవర్ గా పని చేస్తుండగా.., భార్య స్థానికంగా ఉండే ఓ గిన్నెల షాపులో పని చేస్తూ ఉండేది. దీంతో వీరి కాపురం ఎలాంటి గొడవలు, మనస్పర్ధలు లేకుండా అలా సాగుతూ వస్తుంది. ఈ క్రమంలోనే వయ్యారి వడివేలు స్థానికంగా ఫ్యాన్సీ దుకాణాన్ని నడిపిస్తున్న వినయ్ అనే యువకుడితో పరిచయం పెంచుకుంది. ఈ పరిచయంతోనే అతనితో ప్రేమా, గీమా అంటూ తిరిగింది. అయితే సెల్విరాణి కూడా ఎర్రగా, బుర్రగా ఉండడంతో మనోడు కూడా ఆగలేక ఆమెతో స్నేహాన్ని.. కాదు.. కాదు.. ఫేక్ ప్రేమాయాణాన్ని మొదలుపెట్టాడు. అలా వీరీ చీకటి ప్రేమాయణం సాగుతున్న తరుణంలోనే సెల్విరాణికి పెళ్లి జరిగిందన్న విషయం ప్రియుడు వినయ్ కి తెలిసిపోయింది. దీంతో ఏదేదో కబుర్లు చెప్పి సెల్విరాణి ప్రియుడిని తన మాయలోకి దింపేసింది.
అలా కొన్ని రోజుల తర్వాత భార్య సాగిస్తున్న చీకటి బాగోతం బయటపడింది. దీంతో భర్త వడివేలు భార్యపై కోపంతో దాడి చేసి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే భార్య సెల్విరాణికి భర్తతో ఉండలేక ప్రియుడితో ఉండాలనుకుంది. ఇలా అయితే కాదనుకుని నా భర్తను ప్రాణాలతో లేకుండా చేయాలని అనుకుంది. ఇక అనుకున్నదే ఆలస్యం.., సెల్విరాణి ప్రియుడికి ఫోన్ చేసి.. మనది స్వచ్చమైన ప్రేమ, నా భర్తను చంపెయ్, మనం అప్పుడు సంతోషంగా ఉంటూ బాగా ఎంజాయ్ చేద్దాం అంటూ ప్రియుడికి చెప్పింది. ఇది విన్న ప్రియుడు వినయ్ గత కొన్ని రోజులు ప్రియురాలి భర్త వడివేలుతో స్నేహం చేసి అప్పుడప్పుడు ఇద్దరు కలిసి మద్యం తాగేవారు. ఇక వడివేలును చంపేందుకు వినయ్ ఆ సమయం కోసం ఎదురు చూశాడు. ఇక ఇందులో భాగంగానే వినయ్ వడివేలును హత్య చేసేందుకు ఇటీవల నిరంజన్, కిశోర్ అనే ఇద్దరితో రూ.2.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే వీరి ప్లాన్ లో భాగంగానే ఈ నెల 5వ తేదీన వినయ్ వడివేలును ఓ చోటకు రమ్మని కబురు పంపాడు. ఇక వడివేలు వినయ్ చెప్పినట్లుగానే చెప్పిన చోటుకు వెళ్లాడు.
అక్కడికి వెళ్లాక ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. అనంతరం వినయ్ తాగిన మద్యం బాటిల్ తో వడివేలు తలపై బలంగా బాదాడు. అనంతరం వెంట తెచ్చుకున్న కత్తితో వడివేలును 23 సార్లు పొడిచి దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఇక తెల్లారేసరికి వడివేలు హత్యకు గురయ్యాడన్న విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక నాకేం తెలియదు అన్నట్లుగా భార్య సెల్విరాణి ముసలి కన్నీరు కార్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా.. వడివేలు హత్య ఆయన భార్య సెల్విరాణి ఆదేశాలతోనే జరిగిందని పోలీసులు నిజాలు బయటపెట్టారు.
ఇక సెల్విరాణి ప్రియుడు వినయ్ ను పెళ్లి చేసుకునేందుకు భర్త వడివేలును చంపించిందని పోలీసులు సంచలన నిజాలు బయటపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న వడివేలు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ కు గురై సెల్విరాణిని, ఆమె ప్రియుడు కఠినంగా శిక్షించాలని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులైన సెల్విరాణి, వినయ్, నిరంజన్, కిశోర్ లను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. కట్టుకున్న భర్తను కాదని ప్రియుడితో కలిసి ఉండేందుకు దుర్మార్గంగా ఆలోచించిన ఈ కిలాడి లేడీకి ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.