ఆమెకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా చాలదన్నట్లుగా పరాయి మగాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అంతేకాకుండా తాజాగా బాయ్ ఫ్రెండ్ తో భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. తట్టుకోలేని మొగుడు ఏం చేశాడో తెలుసా?
ఈ మధ్యకాలంలో పెళ్లైన కొంత మంది మహిళలు భర్తను కాదని మరో మగాడిపై మనసు పడుతున్నారు. ఇక భర్తకు తెలియకుండా ప్రియుడితో ఎంచక్కా రొమాన్స్ కు తెరలేపుతున్నారు. అసలు విషయం బయటపడడంతో భర్తను భార్య చంపడమో, లేదంటే భర్తే భార్యను చంపడమో చేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే ఏపీలో వెలుగు చూసింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని చిత్తూరు జిల్లా గూడురు పరిధిలోని సొసైటీ ప్రాంతం. ఇక్కడే శ్రావణి (30)-నాగరాజు దంపతులు నివాసం ఉండేవారు. వీరికి ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఇద్దరు పిల్లలు జన్మించారు. పిల్లలను చూసుకుంటూ ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. అయితే గత ఏడాది నుంచి దంపతుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో 8 నెలల నుంచి ఈ భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే శ్రావణికి గూడూరు రెండో పట్టణానికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం రాను రాను ఇద్దరి మధ్య వివాహేతర సంబంధంగా మారింది. ఈ క్రమంలోనే శ్రావణి చెన్నూరులోని ఓ తోటలో కాపలాగా ఉంటూ ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇదే విషయం భర్త నాగరాజు చెవిన పడడంతో కోపంతో ఊగిపోయాడు.
ఆదివారం నాగరాజు భార్య శ్రావణికి ఫోన్ చేశాడు. నిన్ను చూడాలని ఉందంటూ ఆమె ఉంటున్న తోటలోకి వచ్చాడు. అక్కడికి రాగానే భార్య ప్రియుడు వెంకటేశ్వర్లతో కనిపించింది. ఈ సీన్ చూసిన నాగరాజు తట్టుకోలేపోయాడు. వెంటనే కత్తితో తన భార్య శ్రావణిపై అనేకసార్లు దాడి చేశాడు. అడ్డుకోబోయిన వెంకటేశ్వర్లుపై కూడా నాగరాజు దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే గమనించిన స్థానికులు ఆ వివాహితను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, ఆమె అప్పటికే మరణించిందని వైద్యులు నిర్ధారించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. భార్య బాయ్ ఫ్రెండ్ తో ఉండడం చూసి కోపంతో హత్య చేసిన భర్త దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.