ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొంత కాలం పాటు భర్తతో సంసారం చేసి ముగ్గురు పిల్లలకు తల్లైంది. ఇక రాను రాను భర్త పాతవాడు కావడంతో పరాయి మగాళ్ల వైపు చూసింది. చూడటమే కాదు.. ఏకంగా ఓ యువకుడితో వివాహేతర సంబంధాన్నే కొనసాగించింది. ఇలా కొన్నాళ్ల పాటు భర్తకు తెలియకుండా భార్య చీకటి సంసారాన్ని నడిపించింది. ఇక అసలు విషయం భర్తకు తెలియడంతో పక్కా ప్లాన్ ప్రకారమే అడుగులు వేసిన భార్య చివరికి కట్టుకున్న భర్తను ప్రాణాలతో లేకుండా చేసింది. ఇటీవల చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
అసలేం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నగరిలో విజయకుమార్, వనిత అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి 14 ఏళ్ల కిందట వివాహం జరిగి ముగ్గురు పిల్లలు కూడా జన్మించారు. భర్త స్థానికంగా సెల్ ఫోన్ షాపు నడుపుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ క్రమంలోనే భర్త విజయకుమార్ కు వ్యాపారరీత్యా తమిళరసు(21) అనే యువకుడితో పరిచయం ఉంది. దీంతో తమిళరసు అప్పుడప్పుడు విజయకుమార్ ఇంటికి వస్తుండేవాడు. అలా వస్తున్న క్రమంలోనే వనిత తమిళరసుతో పరిచయం పెంచుకుంది. ఈ పరిచయమే ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. అలా కొన్నాళ్ల పాటు వనిత అతని ప్రేమలో పడి భర్త లేని సమయంలో శారీరక కోరికలు తీర్చుకుంటుంది.
భార్య తమిళరసుతో పరిచయం పెరగడాన్ని పసిగట్టిన భర్త తమిళరసును బెదిరించి ఇక నుంచి ఇంటికి రాకూడదని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో భార్య ప్రియుడితో కలిసేందుకు భర్త అడ్డుగా ఉన్నాడని గ్రహించింది. ఇక భర్తనే లేకుండా చేస్తే ప్రియుడితో ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చనే నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగానే భార్య వనిత ఇదే విషయాన్ని తన ప్రియుడైన తమిళరసుకు ఫోన్ చేసి వివరించింది. ప్రియురాలి మాటను కాదనని తమిళరసు అతని హత్యకు ప్లాన్ గీశారు. హత్యలో భాగంగానే తమిళరసు నాగరాజు, సంతోష్ కుమార్ అనే మిత్రులతో ముందుగా రెక్కి నిర్వహించారు. కాగా గత ఆదివారం వీరందరూ కలిసి రాత్రి మద్యం తాగారు. ఫుల్ గా తాగాక… విజయకుమార్ కు ఫోన్ చేసి పెట్రోల్ అయిపోయిదని, తీసుకు రావాలంటూ కబురు పంపారు.
కాదనకుండా పెట్రోల్ తీసుకుని వెళ్లిన ఈతరాని విజయకుమార్ ను చెరువులో ముంచే ప్రయత్నం చేశారు. అతను తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా పై నుంచి అతనిపై రాళ్లు విసరడంతో గాయలపాలై విజయకుమార్ నీట మునిగి మరణించాడు. ఈ విషయాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారాన్నిఅందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి అనుమానాస్పద కేసు కింద నమోదు చేసుకున్నారు. ఇక పోలీసులు అనుమానితులను విచారిస్తుండగా భార్య వనిత స్థానిక వీఆర్వో వద్దకు వెళ్లి చేసిన తప్పును ఒప్పుకుంది. అనంతరం వనిత చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు తమిళరసుతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.