నేటి కాలంలో కొందరు యువకులు చిన్న వయసులోనే మద్యానికి అలవాటు పడి చెడు దారుల్లో పయనిస్తున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా పెళ్లైన వివాహితలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని నిండు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాగే అడుగులు వేసిన ఓ యువకుడు 50 ఏళ్ల మహిళతో ప్రేమ వ్యవహారాన్ని నడిపాడు. దీంతో పాటు తరుచు ఆమెతో శారీరకంగా కలుస్తు అర్థాంతరంగా ప్రాణాలు విడిచాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది ఏపీలోని చిత్తూరు జిల్లా కాసిరాళ్ల గ్రామం. ఇదే ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల సురేష్ తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటూ స్థానికంగా ఓ పౌల్ట్రీ ఫామ్ లో పని చేస్తున్నాడు. అయితే అదే కోళ్ల ఫారమ్ లో అనంతపురం జిల్లాకు చెందిన 50 ఏళ్ల మహిళ సైతం పని చేస్తుంది. గతంలో ఆమె భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటూ జీవనాన్ని కొనసాగిస్తుంది. అయితే వీరిద్దరూ ఒకే దగ్గర పని చేస్తుండడంతో పరిచయం ఏర్పడింది. రాను రాను వీరిద్దరూ సన్నిహితంగా మెలగడం మొదలు పెట్టారు. చివరికి వీరి పరిచయం ప్రేమగా మారింది.
ఇక భర్త కూడా లేకపోవడంతో ఆ వివాహిత సైతం సురేష్ తో ఎంచక్కా ఎంజాయ్ చేస్తూ వచ్చింది. ఇక సమయం దొరికినప్పుడల్లా సురేష్ ఆ మహిళతో శారీరకంగా కలుసుకోవడం మొదలు పెట్టాడు. ఇక కొన్నాళ్లకి ఆ మహిళ.., తన చెల్లెలి కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తానని, నాతో పాటు చింతపల్లికి రావాలని నచ్చచెప్పింది. దీంతో ఎగేసుకుని అడుగులు వేసిన సురేష్ ఆమెతో పాటు చింతపల్లికి చేరుకున్నాడు. అక్కడికి వెళ్లాక సురేష్, ఆ మహిళ ఒకే రూమ్ లో ఉంటూ సహజీవనం చేశారు. అయితే తమ కొడుకు సురేష్ ఓ మహిళతో చింతపల్లిలో ఉంటున్నాడని గ్రహించిన ఆ యువకుడి తల్లిదండ్రులు అతడిని తీసుకెళ్లేందుకు చింతపల్లికి చేరుకున్నారు.
తల్లిదండ్రులు ఎంత మొత్తుకున్నా కూడా.., నేను రానని, బలవంతం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని బ్లాక్ మెయిల్ కు దిగాడు. కొడుకు మాటలు విన్న సురేష్ తల్లిదండ్రులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఉన్నట్టుండి సురేష్ ఆరోగ్యం క్షీణించడంతో పాటు అతనికి పచ్చకామెర్ల వ్యాధి సోకింది. అయితే శనివారం రాత్రి సురేష్ తిని పడుకున్నాడు. ఆదివారం ఎంత సమయం అయినా సురేష్ నిద్రలేవలేదు. దీంతో అనుమానం వచ్చిన సురేష్ ప్రియురాలు అతడిని నిద్రలేపే ప్రయత్నం చేసింది. ఎంతకు నిద్రలేవకపోవడంతో సురేష్ మరణించాడని ఆ మహిళ తెలుసుకుంది.
ఇక ఏం చేయాలో అర్థం కాని ఆ మహిళ భయంతో వెంటనే సురేష్ తల్లిదండ్రులకు సమాచారం అందించింది. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న సురేష్ తల్లిదండ్రులు కొడుకుని చూసి బోరున విలపించారు. నా కొడుకి మరణానికి కారణం అతడి ప్రియురాలేనంటూ సురేష్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.