చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో ఓ భర్త కన్న పిల్లల ముందే భార్యను దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. వెదురుకుప్పం మండలం ఆళ్లముడుగు. ఇదే గ్రామానికి చెందిన సోకుకు ముద్దికుప్పం గ్రామానికి చెందిన నీల అనే మహిళతో 2016లో పెళ్లిజరిగింది. కొన్ని రోజుల తర్వాత వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు.
పుట్టిన పిల్లలతో ఆ దంపతులు కొన్నాళ్లు బాగానే ఉన్నారు. కానీ రోజులు గడిచే కొద్ది భర్త భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఇదే విషయమై భార్యాభర్తల మధ్య తరుచు గొడవలు జరుగుతుండేవి. గ్రామ పెద్దలు కలగజేసుకుని పంచాయితీలో భార్యాభర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కొన్ని రోజుల పాటు బాగానే సంసారం చేశారు. ఆ తర్వాత కథ మళ్లీ మొదటికి తిరగడంతో ఇటీవల భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ రాజుకుంది.
ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇక కోపంతో ఊగిపోయిన భర్త క్షణికావేశంలో పిల్లల ముందే భార్యను విచక్షణరహితంగా కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. రక్తపు మడుగులో పడి నీల ప్రాణాలు వదిలింది. ఈ విషయం తెలుసుకున్న నీల తల్లిదండ్రులు ఘటన స్థలానికి చేరుకున్నారు. విగతజీవిగా పడి ఉన్న కూతురిని చూసి ఆ తల్లిదండ్రులు కన్నీటి సంద్రంలో మునిగితేలారు. అనంతరం భర్తపై లీల తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. వేదమంత్రాల సాక్షిగా భార్య మెడలో తాళికట్టిన భర్త చివరి వరకు తోడుగా ఉంటానని.. అనుమానంతో దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటనలో భర్త కిరాతకంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.