కన్న కూతురిలా చూసుకోవాల్సిన అత్త కోడలిపై కన్నెర్ర జేసి నాలుగు నెలల గర్భిణి అన్న విషయాన్ని కూడా మరిచి, విచక్షణ కోల్పోయి కోడలిపై పెట్రోల్ పోసి నిప్పింటించిన విషయం తెలిసిందే. కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన మరువక ముందే తాజాగా మరో అత్త కోడలిపై దారుణంగా ప్రవర్తించింది. కొడుకు మరణించడంతో కోడలిపై అనుమానం పెంచుకున్న అత్త ఇంట్లోకి రాకుండా అడ్డుకుంది. ఏకంగా ఇంటికి తాళం వేసి ఇంటి నుంచి తరిమెయ్యాలని చూసింది. చిత్తూరు జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని పీలేరు పట్టణంలోని పాలాల వీధికి చెందిన హరి ప్రసాద్ అనే యువకుడికి హైదరాబాద్ లోని కవాడిగూడకు చెందిన స్వర్ణలత అనే మహిళతో 13 ఏళ్ల కిందట వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు పిల్లల సంతానం. పెళ్లైన చాలా కాలం పాటు వీరి కాపురం సాఫీగానే సాగుతూ వచ్చింది. అయితే గత నాలుగేళ్ల కిందట భర్త హరిప్రసాద్ ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స అందించారు.
ఇది కూడా చదవండి: అసలు వీడు భర్తేనా..? కన్న పిల్లల ముందే భార్యపై భర్త దారుణం!
ఇక ఇంతటితో ఆగకుండా అత్తమామలు కోడలిని ఇంట్లోకి రాకుండా తాళం వేశారు. దీంతో రోడ్డున పడ్డ కోడలు నాకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అత్తమామలు కోడలిపై చేస్తున్న ఈ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలయజేయండి.