వాళ్లిద్దరికీ ఫేస్ బుక్ లో పరిచయం. కొన్నాళ్ల పాటు బాగానే మాట్లాడుకున్నారు. అలా కొంత కాలానికి ఇద్దరూ ఇంకాస్త దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి ఆ మహిళ నగ్న వీడియోలు, ఫొటోలను భద్రపరుచుకుని ఏకంగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా యుగం కొత్త పుంతలు తొక్కడంతో అందరూ ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, షేర్ చాట్ వంటివి వాడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడా ఏం జరిగిందనేది క్షణాల్లో తెలుసుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉన్నా సోషల్ మీడియా ద్వారా లాభం ఎంతుందో నష్టం కూడా అంతే ఉంది. ఈ విషయం మీకు కూడా తెలుసనుకోండి. ఇదిలా ఉంటే ఓ యువతి, యువకుడు ఫేస్ బుక్ ద్వారా పరిచయమయ్యారు. రోజూ ఫోన్ లు, చాటింగ్ చేసుకున్నారు. అలా కొన్ని రోజులు గడిచింది. ఇద్దరూ చాలా చనువుగా మెలిగారు. ఇక అదే చనువుగా ఆసరాగా చేసుకున్న ఆ వ్యక్తి యువతి నగ్న వీడియోలు, ఫొటోలు తీసుకున్నాడు. అదే వీడియోలను ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఏపీలోని చిత్తూరు జిల్లా చౌడేపల్లి ప్రాంతానికి చెందిన మహిళ(30)కు రామసముద్రం మండలం గోసువారిపల్లెకు చెందిన అంజన్ కుమార్ రెడ్డి ఫేస్ బుక్ లో పరిచయం అయ్యాడు. దీంతో రోజూ మెసేజ్ లు, కాల్స్ మాట్లాడుకునేవారు. అలా కొన్నాళ్ల తర్వాత ఇద్దరూ కాస్త దగ్గరై చనువుగా మెలిగారు. దీంతో పాటు ఇద్దరి మధ్య వీడియో కాల్స్ కూడా నడిచినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే అంజన్ కుమార్ రెడ్డి ఆ మహిళ నగ్న ఫొటోలు, వీడియోలను భద్రపరుచుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, అతడు అదే వీడియోలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలను చూసిన ఆ మహిళ ఒక్కసారిగా షాక్ గురైంది. ఆమెకు ఏం చేయాలో తెలియక వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. మహిళ నగ్న వీడియోలు, ఫొటోలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఈ యువకుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.