చిత్తూరు జిల్లాలో ఇటీవల బ్యూటీషియన్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇక చికిత్స పొందుతున్న నిందితుడిని పోలీసులు విచారించగా అసలు నిజాలు వెల్లగక్కాడు. నిందితుడు బయటపెట్టిన నిజాలతో ఈ కేసు మిస్టరీ వీడింది.
చిత్తూరు జిల్లా వేలూరు రోడ్డులో బ్యూటీషియన్ దుర్గా ప్రశాంతీ ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రా వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసలేం జరిగిందనే దానిపై అనేక కోణాల్లో విచారించారు. మొత్తానికి ఈ కేసులో నిందితుడిగా ఉన్నయువకుడిని విచారించగా అసలు మిస్టరీ ఏంటో బయటపడింది. బ్యూటీషియన్ దుర్గా ప్రశాంతీ మృతి కేసులో అసలు మిస్టరీ ఏంటంటే?
అసలేం జరిగిందంటే?
తెలంగాణలోని కొత్తగూడెంకు చెందిన చక్రవర్తి అనే యువకుడికి చిత్తూరు జిల్లా వేలూరుకు చెందిన దుర్గ ప్రశాంతి అనే యువతి ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం దాదాపుగా రెండేళ్ల పాటు కొనసాగింది. అప్పటి నుంచి ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉండేవారు. అయితే చక్రవర్తి ప్రశాంతికి దగ్గరగా ఉండాలని భావించి తన తల్లిని చిత్తూరుకు తీసుకొచ్చి ఏకంగా దుర్గ ప్రశాంతి ఊరిలోనే ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. ఇక్కడే ఓ షాపును నిర్వహిస్తూ ఆ యువకుడు కాలాన్ని వెల్లదీశాడు. ఈ క్రమంలోనే చక్రవర్తి, దుర్గా ప్రశాంతిల మధ్య బంధం మరింత బలపడింది. దీంతో ఆ యువకుడు ఎలాగైన ప్రశాంతినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇదే విషయాన్ని ప్రశాంతికి కూడా వివరించాడు. దీనికి దుర్గా ప్రశాంతి స్పందించి.. ఇప్పుడే పెళ్లి చేసుకోలేనని, ఇంకాస్త టైమ్ కావాలని తెలిపింది. ప్రశాంతి అలా చేప్పడంతో చక్రవర్తి జీర్ణించుకోలేకపోయాడు.
ఆ రోజు ఏం జరిగిందంటే?
దుర్గ ప్రసాద్ గత వారం రోజుల నుంచి తనను పెళ్లి చేసుకోవాలని ప్రశాంతి వెంటపడేవాడు. తరుచు ఫోన్ లు చేస్తూ విసిగించేవాడని సమచారం. దీంతో విసుగిపోయిన ప్రశాంతి.. చక్రవర్తి ఫోన్ నెంబర్ ను బ్లాక్ లో పెట్టి అతనితో మాట్లాడడమే మానేసింది. ఇదంతా గమనించిన చక్రవర్తి నన్ను కావాలనే పక్కకు పెడుతుందని గ్రహించాడు. ఆమెతో మాట్లాడే వీలు లేకపోవడంతో చక్రవర్తి ప్రశాంతికి మెయిల్ కు ఎనిమిది పేజీల లేఖను పంపాడు. చక్రవర్తి లేఖపై ప్రశాంతి అస్సలు స్పందించలేదు. ఇక విసిగిపోయిన చక్రవర్తి మంగళవారం మధ్యాహ్నం 12:30 నిమిషాలకు నేరుగా ప్రశాంతి బ్యూటీపార్లర్ కు వెళ్లాడు. అక్కడికి వెళ్లి నన్ను పెళ్లి చేసుకోవాలని ఆమెతో గొడవ పడ్డాడు. ఇదే విషయమై ఇద్దరు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు.
ఈ క్రమంలోనే కోపంతో ఊగిపోయిన చక్రవర్తి.. బ్లేడుతో తన చేయి తానే కోసుకున్నాడు. దీంతో ప్రశాంతి భయపడి అరుస్తూ బయటకు వెళ్లే ప్రయత్నం చేసింది. వెంటనే చక్రవర్తి దుర్గ ప్రశాంతి గొంతును గట్టిగా పట్టుకున్నాడు. ఇక ఊపిరాడక ఆ యువతి క్షణాల్లో మరణించింది. ప్రియురాలు చనిపోయిందని తెలుసుకున్న చక్రవర్తి.. భయంతో తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. ఇక ఆ యువకుడు అదే బ్లేడుతో తన గొంతు కోసుకుని రక్తపు మడుగులో కిందపడిపోయాడు. గమనించిన కొందరు స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కొన ప్రాణాలతో ఉన్న చక్రవర్తిని ఆస్పత్రికి తరలించారు. ఇక దుర్గ ప్రశాంతి మృతదేహాన్ని పోస్ట్ మార్టం ఆస్పత్రికి చేర్చారు. దుర్గ ప్రశాంతి హత్యకు గురైందని తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ మొదలు పెట్టారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు చక్రవర్తిని విచారించడంతో అసలు నిజాలు బయటపెట్టాడు. పెళ్లికి నిరాకరించిందని, అందుకే హత్య చేశానని నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు చక్రవర్తి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పెళ్లికి నిరాకరించందనే కారణంతో యువతిని హత్య చేసిన చక్రవర్తి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.