ప్రేమించుకున్నారు.. పెద్దల ఆమోదంతో పెళ్లి చేసుకున్నారు. వివాహం అయ్యి 48 గంటలు కూడా గడవకముందే.. ఒకే గదిలో ఒంటి మీద కత్తి పోట్లతో విగతజీవులుగా కనిపించారు. మరి కొన్ని గంటల్లో రిసెప్షన్ జరగాల్సిన ఇంట్లో ఈ విషాదం చోటు చేసుకుది. అసలేం జరిగింది అంటే..
వారిద్దరది ప్రేమ వివాహం. పెళ్లి జరిగి 48 గంటలు కూడా పూర్తి కాలేదు. నిండు నూరేళ్లు కలిసి ఉంటామని తల్లిదండ్రుల సమక్షంలో ప్రమాణాలు చేసి.. వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. మరి కొన్ని గంటల్లో రిసెప్షన్ వేడుక. ఇరు కుటుంబాలు ఆ ఏర్పాట్లు చూస్తున్నారు. నవ దంపతులు దుస్తులు మార్చుకోవడం కోసం గదిలోకి వెళ్లారు. ఎంతకీ బయటకు రాలేదు. కాసేపటికి వారి గది నుంచి అరుపులు, కేకలు వినిపించాయి. ఏమైందని తలుపు కొట్టారు. కానీ లోపలి నుంచి ఎలాంటి స్పందన లేదు. కిటికీలోంచి చూడగా.. నవ దంపతులు శవాలుగా పడి ఉన్నారు. వారి శరీరంపై కత్తి గాట్లు ఉన్నాయి. మరి ఆ గదిలో ఏం జరిగింది.. ఇంతటి దారుణానికి కారకులు ఎవరు.. వంటి వివరాలు తెలియాలంటే ఇది చదవండి.
ఈ విషాదకర సంఘటన చత్తీస్‌గఢ్, రాయ్‌పూర్‌లో చోటు చేసుకుంది. నవ వధూవరులను అస్లాం, కహక్షా బానోగా గుర్తించారు. తిక్రాపారా పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రిజ్ నగర్‌లో మంగళవారం ఈ దారుణం చోటు చేసుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఫిబ్రవరి 19 అస్లాం(24), కహక్షా బానో(22)కు వివాహం జరిగింది. మంగళవారం సాయంత్రం వీరికి రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రెడీ అవ్వడం కోసం వీరిద్దరూ తమ గదిలోకి వెళ్లారు. ఎంతసేపటికి బయటకు రాలేదు. ఇంతలో గది నుంచి కహక్షా అరుపులు వినిపించాయి. దాంతో కుటుంబ సభ్యులు వెళ్లి డోర్ కొట్టారు. కానీ ఎంతకు తలుపు తీయలేదు. ఈ క్రమంలో కిటికీలోంచి గదిలోకి చూడగా భయంకర దృశ్యాలు కనిపించాయి.
అస్లాం, కహక్షా ఇద్దరు రక్తపు మడుగులో పడి ఉన్నారు. దాంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నవ దంపుతులు ఉన్న గది తలుపులు బద్దలు కొట్టి.. లోపలికి వెళ్లి మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు. కొత్త జంట మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక మృతులు ఇద్దరి శరీరంపై ఒకే రకమైన గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు. గదిలో ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఇక వీరిది ప్రేమ వివాహం కావడం గమనార్హం. పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్న వీరు.. పెళ్లై 48 గంటలు కూడా గడవకముందే ఇలా శవాలుగా ఎందుకు మారారు అంటే..
గదిలోకి వెళ్లి రెడీ అవుతున్న సమయంలో దంపతుల మధ్య చిన్న వివాదం ప్రారంభం అయ్యింది. ఈ క్రమంలో నవ వరుడు కత్తితో భార్యను పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత భయంతో తాను కూడా పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే.. వీరి మృతికి గల అసలు కారణాలు తెలుస్తాయి అంటున్నారు పోలీసులు. ఇక ప్రేమించి, పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్న వీరు.. 48 గంటలు కూడా గడవకముందే.. మృత్యువాత పడటం ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. నవ దంపతుల మృతితో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.