ఈ మద్య కొంత మంది చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటున్నారు. ఆ సమయంలో తమ విచక్షణ కోల్పోయి పలు అఘాయిత్యాలకు పాల్పపడుతున్నారు. రోడ్డు పై వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే.. ఎంతో చిరాకు అనిపిస్తుంది. ఓ అమ్మాయి తనకు ఎదురుగా సైకిల్ పై వెళ్తున్న వ్యక్తి పక్కకు తప్పుకోవాలని హారన్ కొట్టినా.. పట్టించుకోకపోవడంతో కోపంతో అతన్ని పొడిచి చంపింది. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో కంకిలిపారా ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలిక స్కూటీపై తన తల్లిని తీసుకుని వస్తోంది. ఆ సమయంలో ట్రాఫిక్ రద్ది బాగానే ఉంది.. ఆమె ముందు సుదామా లాడెర్ (40) అనే వ్యక్తి సైకిల్ పై వెళ్తున్నాడు. వెనక వస్తున్న బాలిక సైకిల్‌ను దాటి ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో పలుమార్లు హారన్ కొట్టింది. చెవిటి వాడైన సుదామాకు హారన్ శబ్దం వినిపించకపోవడంతో ఆమెకు సైడ్ ఇవ్వలేదు.
కోపంతో ఊగిపోయిన ఆ బాలిక సైకిల్‌ను దాటి ముందుకెళ్లి స్కూటీ ఆపి తన వద్ద ఉన్న కత్తితో సుదామా గొంతులో పొడించింది. వెంటనే సుదామా అక్కడే కూలిపోయాడు. కోపంలో తాను చేసిన పనికి భయంతో వణికిపోయిన బాలి.. తల్లిని అక్కడే వదిలి పారిపోయింది. బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
కత్తి బలంగా గుచ్చుకున్న కారణంగా.. అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి బాలికను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్షణికావేశంలో విచక్షణ కోల్పోతే ఇలాంటి దారుణాలు జరుగుతాయి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
టైటిల్ : మైనర్ బాలుడు, పక్కింటి భార్య మిస్సింగ్! పోలీసులకే అర్ధం కాని ట్విస్ట్!
టైటల్ : ఆస్తి కోసం తండ్రిని కొడవలితో నరికి చంపిన కొడుకు!