ఛత్తీస్ గఢ్ లో దారుణం చోటు చేసుకుంది. మగపిల్లల సంతానం కావాలంటూ భర్త భార్యను వేధింపులకు గురిచేసేవాడు. వరుసగా ఐదుగురు ఆడపిల్లలే పుట్టడంతో భర్త తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఇటీవల భార్యను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోకుండా ఆపాలనే ప్రయత్నం చేశాడు. కానీ భర్త మాట వినని భార్య భర్తకు షాకిస్తూ ఊహించని నిర్ణయం తీసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్ గఢ్ కవార్దాలోని చీర బంధ ప్రాంతంలో మన్మోహన్ సాహు (40), రసితా బాయి (36) అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి పెళ్లై చాలా ఏళ్లు గడుస్తుంది. వీరికి ఐదుగురు సంతానం. అందరు ఆడపిల్లలే. వరుసగా ఆడపిల్లలు పుట్టడంతో భర్త మన్మోహన్ సాహు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. వంశం నిలబడాలని కారణంతో ఆమె భర్త మగ సంతానం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే ఇటీవల ఈ దంపతులకు ఐదో సంతానంగా మళ్లీ ఆడబిడ్డే జన్మించింది.
ఇది కూడా చదవండి: Mysuru: కట్టుకున్నవాడిని కాదని సీక్రెట్ గా ప్రేమాయణం.. భార్యకు తెలియకుండా భర్త!
ఇప్పుడు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవద్దంటూ భర్త భార్యను వేధించాడు. నా వల్ల కాదని, నేను ఆపరేషన్ చేయించుకుంటానంటూ భార్య భర్తకు తెగేసి చెప్పింది. ఇదే విషయమై భార్యాభర్తల మధ్య తరుచు గొడవలు కూడా జరిగాయి. ఈ క్రమంలోనే భార్య భర్తకు తెలియకుండా ఆస్పత్రికి వెళ్లి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న భర్త భార్యపై కోపంతో ఊగిపోయి దాడి చేసేందుకు ప్రయత్నించాడు. భర్త తీరుపై భార్య స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.