ప్రశాంత్ లాల్-జ్యోతి రాణి జగత్ దంపతులు. పెళ్లైన నాటి నుంచి ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉన్నారు. కానీ, కొన్ని రోజుల తర్వాత భర్త బుద్ది మారి రాక్షసుడిలా మారడు. ఇంతటితో ఆగకుండా ఇటీవల ఊహించిన దారుణానికి పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే?
ఛత్తీస్‌గఢ్ లో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య అని చూడకుండా భర్త ఊహించని కిరాతకానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతుంది. అయితే ఈ ఘటనలో భర్త ఎలాంటి దారుణానికి ఒడిగట్టాడు. తాళికట్టిన భార్యపై అతడు అంతలా బరితెగించాడా? ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందనే మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ముంగేలి జిల్లాలోని ఫాస్టర్‌పూర్ గ్రామంలో ప్రశాంత్ లాల్-జ్యోతి రాణి జగత్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు ఎలాంటి గొడలు, మనస్పర్థలు లేకుండా సంతోషంగా జీవించారు. కానీ, కొన్ని రోజుల తర్వాత భర్త తీరు మారింది. రాక్షసుడిలా మారి.. భార్యతో గొడవకు దిగాడు. ప్రతీ చిన్న విషయానికి నానా హంగామా చేస్తూ భార్యను నిందాడు. అయితే భర్త పోడు పడలేని భార్య.. తన పుట్టింటికి వెళ్లింది. భార్య ఏడాది నుంచి పుట్టింట్లోనే ఉంటుంది.
అయితే గతంలో భర్త అత్తింటికి వచ్చి భార్యను తీసుకెళ్లాడు. దీంతో ఇక నుంచి భర్త బుద్దిగా ఉంటాడని భార్య కూడా నమ్మింది. కానీ, కుక్కతోక వంకర అన్నట్లుగా భర్త మళ్లీ అదే దారిలో వెళ్తూ భార్యను కొట్టడం మొదలు పెట్టాడు. ఇక భర్త చేష్టలకు తట్టుకోలేకపోయిన ఆ ఇల్లాలు… అనేక సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా పోలీసుల నుంచి ఆమెకు సరైన న్యాయం జరగలేదు. ఇక చేసేదేం లేక.. కోర్టులో భర్తపై కేసు వేసింది.
ఈ విషయం తెలుసుకున్న భర్త.. కేసు వెనక్కి తీసుకోవాలని అనేకసార్లు భార్యకు చెప్పి చూశాడు. కానీ, భార్య మాత్రం భర్త మాట వినకలేకపోయింది. దీంతో భర్త ఒక్కసారిగా కోపంతో ఊగిపోయాడు. అయితే సోమవారం భర్త.. పుట్టింట్లో ఉన్న భార్య వద్దకు వెళ్లాడు. అర్థరాత్రి అత్తింటి తలుపులు కొట్టడంతో.. ఎవరో వచ్చారని అత్తమామలు తలుపులు తీశారు. ఇక వస్తూ వస్తూనే అత్తమామలతో పాటు భార్యతో కూడా గొడవ పడి కేసు వెనక్కి తీసుకోవాలని కోరాడు.
అయినా వాళ్లు అస్సలు వెనక్కి తగ్గలేదు. ఇక కోపంతో ఊగిపోయిన భర్త.. పదునైన ఆయుధంతో భార్యపై దాడికి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. భర్త దాడిలో భార్య కాలు పూర్తిగా విరిగిపోయింది. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. కట్టుకున్నభార్య అని చూడకుండా కిరాతకంగా ప్రవర్తించిన ఈ దుర్మార్గుడికి ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.