crime viral video: ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవటం ఈ మధ్య మామూలైపోయింది. పోలీసులు వదిలేసినా.. జనం మాత్రం వదలట్లేదు. తమను తాము కోర్టులుగా భావించి తప్పు చేసిన వారికి శిక్షలు విధిస్తున్నారు. తాజాగా, ఛత్తీష్‌ఘర్‌కి చెందిన ఓ ఐదుగురు వ్యక్తులు దొంగతనం చేసిన ఓ వ్యక్తిని దారుణంగా హింసించారు. దాన్నంతా వీడియో తీశారు. ఆ వీడియో కారణంగానే చివరకు కటకటాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఛత్తీష్‌ఘర్, సూర్యవంశి జిల్లాలోని ఉచ్చబట్టి గ్రామానికి చెందిన మహవీర్ దినసరి కూలీగా, వాచ్ మ్యాన్‌గా పనిచేస్తున్నాడు. ఏప్రిల్ 25న మహవీర్, మనీష్ అనే వ్యక్తి ఇంట్లోకి వెళుతుండగా మనీష్ చూశాడు. మనీష్ పట్టుకోవటానికి ప్రయత్నించగా మహవీర్ తప్పించుకున్నాడు. అయితే, మరుసటి రోజు మహవీర్ దొరికిపోయాడు. మనీష్ అతడ్ని పోలీస్ స్టేషన్‌లో అప్పగించాడు.
అయితే, మనీష్, మహవీర్‌పై ఫిర్యాదు చేయలేదు. దీంతో పోలీసులు మహవీర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారు. అదే రోజు రాత్రి మహవీర్, మనీష్ ఇంటికి వెళ్లాడు. ఇంటి బయట ఉన్న మనీష్ బైకును పాడు చేశాడు. తన బైకును పాడు చేయటంతో మనీష్ తట్టుకోలేకపోయాడు. తన నలుగురు మిత్రుల సహాయంతో మహవీర్‌ను బంధించాడు. ఓ చెట్టుకు తలకిందులుగా కట్టేసి, స్నేహితులతో కలిసి చితక బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#WATCH Chhattisgarh | A man was thrashed by 5 people as he was hung upside down from a tree in Bilaspur district
(Viral video) pic.twitter.com/hjclQDmt7m
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 1, 2022
ఇవి కూడా చదవండి : Gujarat: బంగారం లాంటి భర్త! కానీ.., పుట్టింటి మీద ప్రేమతో భార్య చేసిన దారుణం ఇది!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.