మద్యం తాగొద్దురా? ఆరోగ్యం పాడవుతుంది. మనం డబ్బున్నోళ్లం కాదు.. మానుకోరా..? అని ఓ తాగుబోతు కొడుక్కి తండ్రి నాలుగు మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ, ఆ మాటలు అతనికి రుచించలేదు కాదు కదా! నన్నే తాగొద్దంటావా అంటూ తండ్రిపై రెచ్చిపోయాడు. గుడి సమీపంలో ఉన్న త్రిశూలం తీసుకొచ్చి తండ్రిని పొడిచి చంపేశాడు
‘మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం..‘ మందు తాగే ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసు. అయినా తాను పెట్టే ఆ వంద.. రెండొందలే రాష్ట్ర ఖజానాను నింపుతున్నట్లు గర్వంగా చెప్పుతూ తాగుతుంటారు. పోనీ తాగాక కామ్ గా ఊరుకుంటారా! అంటే అదీ లేదు. దేశానికి తానే ప్రధాని అన్నట్లు విర్రవీగుతారు. ఇలానే ఓ యువకుడు నిత్యం మద్యం మైకంలో మునుగుతూ ఇంటికొచ్చి నానారచ్చ చేసేవాడు. ఈ క్రమంలో తండ్రి మద్యం సేవించొద్దు అని ఆ యువకుడికి చెప్పిగా వినలేదు. పైగా నన్నే తాగొద్దంటావా అంటూ తండ్రిపై రెచ్చిపోయాడు. గుడి సమీపంలో ఉన్న త్రిశూలం తీసుకొచ్చి తండ్రిని పొడిచి చంపేశాడు. ఈ ఘటన చత్తీస్ గడ్ లో చోటుచేసుకుంది.
చత్తీస్ గడ్, రాజ్‌నంద్‌గావ్ జిల్లాకు చెందిన దుఖు రామ్(61)కు ఖేమ్ లాల్ అనే కుమారుడు ఉన్నాడు. అతడు మహారాష్ట్రలోని నాసిలో పని చేస్తూ అక్కడే ఉండేవాడు. కాగా నాలుగు రోజుల క్రితం అతడు సెలవుపై గ్రామానికి వచ్చాడు. అప్పటినుండి విపరీతంగా తాగుతున్నాడు. ఎప్పుడు చూసిన మద్యం మైకంలోనే ఉంటున్నాడు. తాగడం.. తిరగడం.. నచ్చిన టైంలో ఇంటికి రావడం.. గొడవ చేయడం. ఇదే ఇతని దినచర్య. ఈ విషయపై తల్లిదండ్రులు ఎన్నిసార్లు చెప్పినా అతని ప్రవర్తన మారలేదు. ఈ క్రమంలో ఈనెల 2న గ్రామంలోని శిత్లా దేవి ఆలయం వద్ద కుమారుడు ఖేమ్ లాల్ మద్యం మత్తులో ఇతరులతో గొడవపడుతున్నట్లుగా తండ్రికి తెలిసింది.
ఈ విషయం తెలిసిన వెంటనే దుఖు రామ్ ఎక్కడ తన కొడుకుపై చేయి చేసుకుంటారో అన్న భయంతో అక్కడికి పరుగులు పెట్టాడు. అతనిని గొడవ పడకంటూ నివారించాడు. తాగి తిరగడం.. ఇలా గొడవ పడటానికేనా ఇంటికొచ్చిందంటూ అతడికి నాలుగు మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరూ ఇంటికి వెళ్తుండగా తండ్రితో అతనికి వాగ్వాదం మొదలైంది. నన్ను మద్యం తాగొద్దంటావా అంటూ అతడు ఆలయం ముందున్న త్రిశూలాన్ని తీసుకొచ్చి తండ్రినిపొడిచాడు. త్రిసూలం శరీరంలోకి చొచ్చుకెళ్లడంతో దుఖు రామ్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారొచ్చి నిందితుడిని అరెస్ట్ చేశారు. భర్త ప్రాణాలు వదలడం.. కొడుకు జైలు పాలవ్వడంతో వారింట విషాధచాయలు అలుముకున్నాయి. కావున మద్యం తాగేవారు..ఈ ఘటన చూశాకైనా మానుకోండి. మద్యం తాగడం మీకు ఆనందాన్ని ఇచ్చినా.. మీ కుటుంబ సభ్యలులకు ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టేదే. ఈ ఘటనపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.