గత కొంత కాలంగా ఆన్ లైన్ రమ్మీ గేమ్ ఎక్కువుగా చలామణీ అవుతోంది. ఈ మద్య కాలంలో ఆన్ లైన్ రమ్మీలు ఆడుతూ కొంత మంది తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. ఈజీ మనీ కోసం కొందరు, సరదాగా ఆడటం మొదలెట్టి మరికొందరు.. ఆన్లైన్లో పెయిడ్ గేమ్స్, బెట్టింగ్స్తో బతుకులు ఆగం చేసుకుంటున్నారు. ఉన్నదంతా పోగొట్టుకొని మెల్లమెల్లగా అప్పుల పాలై, తిరిగి కట్టలేక, ఇంట్లో వాళ్లకు చెప్పలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలా ఆన్ లైన్ రమ్మీ ఆడుతూ సర్వం పోగొట్టుకున్న ఓ మహిళ చివరికి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. వివరాల్లోకి వెళితే..
చెన్నై మణలి పుదునగర్ కి చెందిన భవానీ గత కొంత కాలంగా ఆన్ లైన్ రమ్మీ, బెట్టింగ్స్ కి అలవాటు పడింది. ఆమె ఐటీ ఉద్యోగం చేసుకుంది టెక్నాలజీ తెలిసిన మహిళ కావడంతో ఇలా ఆన్ లైన్ లో గేమ్స్ ఆడటం, రమ్మీ ఆడటం మొదలు పెట్టింది. ఆమె భర్త భాగ్యరాజ్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆరేళ్ళ క్రితం వీరిద్దరి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. డబ్బు, బంగారం అన్నీ పోగొట్టుకోవడంతో కొంత కాలంగా ఆమె వ్యవహారశైలిలో మార్పులు వచ్చాయి. ఈ క్రమంలో ఆమె తీవ్ర మనస్థాపానికి గురై బాత్ రూమ్ లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పపడింది.
ఇది చదవండి: పవన్ కల్యాణ్ కు రూ.1,000 కోట్ల ఆఫర్ ప్రకటించిన KA పాల్!
ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు. ఆన్ లైన్ కి బానిసై కుటుంబ సభ్యులకు తెలియకుండా బంగారం కుదువ పెట్టి మరీ డబ్బు తీసుకొని ఆడింది. అన్నీ పోగొట్టుకొని కుటుంబం ముందు తన పరువు పోతుందని ఆవేదన చెందింది. భర్త, అత్తమామలు ఎంతగా చెప్పినా ఆమె వినిపించుకోలేదని కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఇది కూడా చదవండి: Aadhi Pinisetty: ఆది పినిశెట్టి పెళ్లి వేడుకలో హీరో నాని సందడి! వీడియో వైరల్!