సమ్మర్ సీజన్ కావడంతో కేటుగాళ్లు కాస్త తెలివిగా ఆలోచించారు. బడా బాబులే లక్ష్యంగా చేసుకున్నారు. ఈ అద్దాలు పెట్టుకుంటే ఎదుటి వాళ్లు నగ్నంగా కనిపిస్తారని నమ్మిస్తారు. ఆ తర్వాత వాళ్లు కొనేటట్లుగా నమ్మించి చివరికి ఒప్పిస్తారు. అయితే వాళ్లు అమ్మే ఒక్కో గ్లాసెస్ ధర ఎంతో తెలిస్తే మైండ్ పోతుంది.
నేటి కాలంలో చాలా మంది డబ్బులు ఈజీగా ఎలా సంపాదించాలనే మార్గాలను వెతుకుతున్నారు. చదువుకున్న వాళ్లు, చదువులేని వాళ్లు అందరూ ఈజీ మనీ కోసం అనేక ఎత్తులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ మధ్యకాలంలో చైన్ స్నాచింగ్ కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ రోజుల్లో దొంగతనానికి పాల్పడేవారు చాలా తెలివిగా, టెక్నిక్ గా ఆలోచిస్తున్నారు. అచ్చం ఇలాగే ఆలోచించిన ఓ ముఠా గ్యాంగ్.. బడా బాబులనే చీటింగ్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు స్టోరీ ఏంటంటే?
పోలీసుల కథనం ప్రకారం.. బెంగుళూరుకు చెందిన శివ, కేరళకు చెందిన కుబైర్, చిత్తు, ఈర్షాద్ అనే వ్యక్తులు చెన్నైలోని కోయంబేడులో కలిసి ఉంటున్నారు. వీళ్లంతా కష్టపడి కాకుండా ఈజీగా డబ్బులు ఎలా సంపాదించాలనే మార్గాలు వెతికారు. ఇందులో భాగంగానే సమ్మర్ ను ఆసరాగా చేసుకుని కూలింగ్ గ్లాసెస్ బిజినెస్ చేయాలనుకున్నారు. కూలింగ్ గ్లాసెస్ వ్యాపారం చేస్తే పర్లేదు. కానీ, ఈ మాయగాళ్లు చేసింది ఏంటో తెలుసా.. సమ్మర్ లో ఈ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటే ఎదుటివాళ్లు నగ్నంగా కనిపిస్తారని ఎంతో మందిని నమ్మించారు. ముఖ్యంగా డబ్బున్న వాళ్లే లక్ష్యంగా చేసుకుని ఈ మాయగాళ్లు అమాయక యువకులను మోసం చేశారు.
ఇదంతా నిజమే అని తెలుసుకున్న చాలా మంది యువకులు ఆశపడి వారి వద్ద ఉన్న కూలింగ్ గ్లాసెస్ కొన్నారు. ఇలా ఎంతో మంది యువకులను నమ్మించి లక్షల్లో పోగేసుకున్నారు. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే? వాళ్లు విక్రయించే ఒక్కో గ్లాసెస్ ధర లక్షల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. కోయంబేడులో ఈ మాయగాళ్ల ముఠాను అరెస్ట్ చేశారు. అనంతరం వారి నుంచి రైస్ ఫులింగ్ చేసే సామాగ్రి, గన్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తదనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నగ్నంగా కనిపించే గ్లాసెస్ అంటూ అమాయకులను మోసం చేసిన ఈ కేటుగాళ్ల చీటింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.