నేట కాలంలో కొందరు పెళ్లైన మహిళలు కట్టుకున్న వాడిని నట్టేట్ట ముంచుతున్నారు. భర్త వద్దు ప్రియుడే మద్దు అనే రీతిలో తెర వెనక వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. భర్తకు తెలియకుండా ఏంచక్కా ప్రియుడితో కలిసి తిరుగుతూ చేసే పనులన్నీ చేస్తున్నారు. ఇలా బరితెగించిన ఓ ఇల్లాలు భర్తను కాదని పక్కింటి కుర్రాడిపై మనసుపడి ఏకంగా ఇద్దరు కలిసి ఇంట్లో ఉండగా భర్తకు చిక్కింది. దీంతో కోపంతో ఊగిపోయిన భర్త ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని తిరుచానూరు అనే మారుమూల పల్లెటూరు. శివ లీల, హరీష్ అనే ఇద్దరు భార్యాభర్తలు. వీరికి నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. అయితే వీరిది పూర్తిగా వ్యవసాయ కుటుంబ నేపథ్యం కావడంతో భర్త పొలం పనుల్లో బిజిగా ఉండేవాడు. కాగా కొన్నాళ్ల పాటు వీరి దాంపత్య సాఫిగానే సాగతూ వచ్చింది. కానీ రోజులు మారే కొద్ది భార్య శివలీల ప్రవర్తనలో మార్పొచ్చి వక్రమార్గంలోకి వెళ్లిపోయింది. దీంతో ఏకంగా పక్కింటి కుర్రాడితోనే వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది.
ఇది కూడా చదవండి: Bachupally: చెల్లెలిపై అత్యాచారం చేసిన అన్న!
అలా కొన్నాళ్ల పాటు భర్తకు తెలియకుండా ప్రియుడితో కోరికలు తీర్చుకుంటూ ఉంది. ఇటీవల ఇంట్లో భర్తలేని సమయంలో శివలీల ప్రియుడిని ఇంట్లోకి తెచ్చుకుంది. ఇక ఈ క్రమంలోనే విపరీతమైన వర్షం కురవడంతో భర్త పొలం నుంచి నేరుగా ఇంట్లోకి వచ్చాడు. ఇక బెడ్ రూంలో పక్కింటి కుర్రాడితో భార్య ఉండడం చూసిన భర్త ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. వెంటనే కోపంతో ఊగిపోయిన భర్త ఆమె ప్రియుడితో పాటు భార్యను కూడా విచ్చలవిడిగా దాడి చేశాడు.
ఇక ఇంతటితో ఆగని భర్త సలసల మరిగే నీటిని భార్య ప్రైవేట్ పార్ట్స్ పై పోశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భార్య ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.