తాళికట్టిన భర్తను లెక్కచేయకుండా పరాయివాడే ఎక్కువనుకుంటున్నారు కొంత మంది మహిళలు. గుట్టుచప్పుడు కాకుండా వివాహేతర సంబంధాల్లో తలదూరుస్తున్న కొందరు భార్యలు భర్తకు పంగనామాలు పెడుతున్నారు. ఇదే కాకుండా వయసుకొచ్చిన పిల్లల ముందే అడ్డు అదుపు లేకుండా ప్రియుడితో తిరుగుతూ తెగ జల్సాలు చేస్తున్నారు. చివరికి అసలు విషయం భర్తకు తెలిసి వార్నింగ్ ఇచ్చేసరికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న వాడినే అంతమొందిస్తున్నారు. అచ్చం ఇలాగే పావులు కదిపిన ఓ ఇల్లాలు ప్రియుడి మాయలో పడి భర్తను దారుణంగా హత్య చేసింది. ఇటీవల చెన్నైలో వెలుగు చూసిన ఈ ఉదాంతం స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది చెన్నైలోని సేలం జిల్లా మెట్టూరు సమీపంలోని కారైక్కాడ్. ఇదే గ్రామానికి చెందిన శక్తివేల్ (37), హరిసి (35) భార్యాభర్తలు. వీరికి పదేళ్ల కిందట వివాహమైంది. కొన్నాళ్లకి వీరికి ఓ కుమారుడుతో పాటు ఓ కూతురు కూడా జన్మించింది. పిల్లా పాపలతో శక్తివేల్ కుటుంబం సంతోషంగా సాగుతూ ఉంది. అయితే వీరి పిల్లలు పెద్దవారై ఎవరి పనులు వాళ్లు చేసుకుంటూ చదువుకుంటున్నారు. అలా కొన్నాళ్ల పాటు ఈ దంపతుల కాపురం ఎలాంటి గొడవలు లేకుండా ఆనందంగా సాగింది. కానీ రోజులు గడుస్తున్న కొద్ది శక్తివేల్ భార్య హరిసి తన బుద్దిని పక్కదారుల్లోకి మళ్లించింది.
ఇది కూడా చదవండి: Guntur: అందంగా ఉందని ఎదురు కట్నమిచ్చి పెళ్లి చేసుకున్నాడు.. పెళ్లయ్యాక తెలిసింది ఏంటంటే?
విషయం ఏంటంటే? హరిసికి స్థానికంగా ఉండే ముత్తుకుమారన్(29) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం రాను రాను వివాహేతర సంబంధంగా రూపుదాల్చింది. ఏకంగా భర్త కళ్లుగప్పి హరిసి ప్రియుడితో తెగ జల్సాలు చేసేది. కొన్నాళ్ల తర్వాత భార్య నడిపిస్తున్న చీకటి కాపురం ఎట్టకేలకు భర్త వరకు చేరింది. దీంతో కోపంతో ఊగిపోయిన భర్త భార్యకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే హరిసికి ప్రియుడితో కలిసి అవకాశం లేకుండా పోయింది. భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య ఎలాగైన భర్తను చంపాలనే ప్లాన్ గీసింది. అందులో భాగంగానే ఇటీవల ఓ రోజు భర్త అర్థరాత్రి జోరుగా నిద్రలోకి జారుకున్న తర్వాత మెల్లగా భార్య ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది.
ఇక నా భర్త అతిగా మద్యం సేవించి మరణించడాని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. దీంతో అనుమానమొచ్చిన శక్తివేల్ తమ్ముడు అన్న మరణంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు శక్తివేల్ భార్యను తమదైన స్టైల్ లో విచారించారు. దీంతో భార్య అసలు విషయం బయటకు కక్కి నా ప్రియుడితో ఉండేందుకనే భర్త అడ్డొస్తున్నాడనే కారణంతోనే ప్రియుడితో కలిసి నేనే హత్య చేశానంటూ ఒప్పుకుంది. ఈ విషయం తెలుసుకున్న శక్తివేల్ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. దీంతో పోలీసులు హరిసితో పాటు ఆమె ప్రియుడిని కూడా అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.