నేటి తరం కొంత మంది అమ్మాయిలు క్షణికావేశంలో నిండు ప్రాణాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు మందలించారని, ప్రియుడు మోసం చేశాడని, చదువులో రాణించలేకపోతున్నానని ఇలా అనేక కారణాలతో తొందర పాటు నిర్ణయాలతో బలవన్మరణానికి పాల్పడి నిండు ప్రాణాలు తీసుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనలోనే ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తాజాగా తమిళనాడులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని అరియలూరు రైల్వే క్యార్టర్స్ లో నటరాజ్-ఉమ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి నిషాంతి అనే కుమార్తె ఉంది. గత ఏడాది జరిగిన ఇంటర్ పరీక్షల్లో నిషాంతి ఉత్తీర్ణత సాధించింది.
అయితే అదే ఏడాది నిషాంతి నీట్ రాసి సీటు సంపాదించాలనుకుంది. కానీ నీట్ లో ఆమెకు సీటు రాలేదు. దీంతో నిరుత్సాహ పడింది. కానీ రెండోవ సారి నీట్ పరీక్ష రాసి ఎలాగైన సీటు సంపాదించాలనుకుంది. దీని కోసం తిరుచ్చిలోని ఓ ప్రైవేట్ ఇనిస్టిట్యూట్ లో శిక్షణ కూడా తీసుకుంది. అయితే కొంతమంది స్నేహితులు నీట్ పరీక్షలో ఈసారి ప్రశ్నలు చాలా కఠినంగా వస్తాయని చర్చించుకున్నారు. దీంతో భయంతో ఊగిపోయిన నిషాంతి పరీక్ష రాయడం నా వల్ల కాదు అని భావించింది.
ఇది కూడా చదవండి: నచ్చిన వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.. చివరికి విషాదం ఏంటంటే?
ఇందులో భాగంగానే ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసిన నిషాంతి.. ఈ సారి కూడా నీట్ ప్రశ్నలు కఠినంగా ఉంటాయని తెలిసింది. ఈ భయంతోనే నేను ఆత్మహత్యకు పాల్పడ్డాను.. అని ఓ లేఖ రాసి వంట గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ సమాచారం పోలీసుల వరకు వెళ్లడంతో కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. ప్రశ్నల భయంతో ప్రాణాలు తీసుకున్న నిషాంతి బతికుంటే గనుక మీరు ఆమెకు ఎలాంటి సూచనలు చేసేవారే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.