ఇతని పేరు కార్తీ. వయసు 22 ఏళ్లు. స్థానికంగా ఉండే ఓ అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఆ యువతి కూడా ఇతగాడిని ఇష్టపడింది. దీంతో ఇద్దరూ కొంత కాలం పాటు ప్రేమించుకున్నారు. అయితే చివరికి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ, వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో కార్తి పారిపోయి ఓ చోట అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లైన కొంత కాలం పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. కట్ చేస్తే పెళ్లైన 8 నెలల తర్వాత కార్తీ రాక్షసుడిలా మారి దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
చెన్నైలోని వేలూరులో కార్తీ (22) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇదే ప్రాంతంలో గుణప్రియ (20) అనే యువతి కూడా ఉంటుంది. ఇదిలా ఉంటే కార్తీ గుణప్రియను ఇష్టపడ్డాడు. ఇదే విషయాన్ని గుణప్రియకు తెలియజేశాడు. కొన్ని రోజుల తర్వాత గుణప్రియ కూడా కార్తీని ఇష్టపడింది. దీంతో ఇద్దరు కొంత కాలం పాటు ప్రేమించుకున్నారు. సమయం దొరికినప్పుడల్లా సినిమాలు, షికారులకు వెళ్తూ.. బాగానే ఎంజాయ్ చేశారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. దీంతో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ, వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు.
ఇలా అయితే కాదని భావించిన ఇద్దరూ 8 నెలల కిందట పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లైన కొంత కాలం పాటు బాగానే సంసారం చేశారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. పెళ్లైన కొన్ని రోజుల తర్వాత భార్యాభర్తల మధ్య గొడవల చెలరేగాయి. దీంతో భర్త కార్తీ రాక్షసుడిలా మారి గుణప్రియను తరుచు వేధించడం మొదలు పెట్టాడు. అయితే ఈ దంపతులు ఇటీవల మరోసారి గొడవ పడ్డారు. ఇలా అయితే కాదని భావించిన భర్త కార్తీ.. భార్యను చంపాలనుకున్నాడు. ఇందులో భాగంగానే కార్తీ ఇటీవల భార్య గుణప్రియను నమ్మించి ఓ గుట్టపైకి తీసుకెళ్లాడు.
అక్కడికి వెళ్లాక కార్తీ భార్య గుణప్రియను దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని కొండపై నుంచి కిందకు తోసేశాడు. స్థానికులు ఈ మృతదేహాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.