వివాహేతర సంబంధం.. సంతోషంగా సాగుతున్న కాపురంలో ఉన్నట్టుండి నిప్పులు పోస్తుంది. ఇంట్లో కట్టుకున్న వాళ్లను కాదని ఈ రోజుల్లో చాలా మంది అక్రమ సంబంధాల వైపు అడుగులేస్తున్నారు. క్షణిక సుఖం కోసం పాకులాడుతూ హత్యలు, ఆత్మహత్యలతో చివరికి పిల్లలను అనాధలను చేసి వెళ్లిపోతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే చెన్నైలో ఇటీవల చోటు చేసుకున్న విషయం తెలిసిందే. భార్య అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తుందనే కారణంతో భర్త భార్యను హత్య చేసి ఆ తర్వాత తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటనలోనే పోలీసులు అసలు నిజాలు బయటపెట్టారు. ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు మీకోసం.
అది చెన్నై కన్యాకుమారి పరిధిలోని మండపం ప్రాంతం. ఇక్కడే ఎబినేజర్, జెబా ఫ్రింజా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 14 ఏళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించారు. కొన్నాళ్ల తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో భార్య భర్తతో ఉండలేక పిల్లలతో పాటు పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక ఇంట్లో ఒంటరిగా ఉండలేని జెబా ఫ్రింజా కొన్ని రోజుల తర్వాత కేరళలోని తిరువనంతపురంలో బ్యూటీపార్లర్ లో పనికి కుదిరింది. కొంత కాలానికి దంపతులకు పెద్దలు నచ్చజెప్పడంతో భర్త మళ్లీ భార్య వద్దకు వచ్చి ఆమెతో కలిసి సంసారం చేశాడు. ఇదిలా ఉంటే భర్త ఎబినేజర్ గత గురువారం నీతో మాట్లాడాలంటూ భార్య ఫ్రింజాను ఓ చోటుకు తీసుకెళ్లాడు. ఇక అక్కడికి వెళ్లాక భర్త భార్య తల నరికి శవాన్ని ఓ చోట వదిలేసి అక్కడి నుంచి పరారై తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఎబినేజర్ స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఇదిలా ఉంటే ఉన్నట్టుండి కూతురు జెబా ఫ్రింజా కనిపించకుండపోవడంతో ఆమె తల్లిదండ్రులు భర్తపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎబినేజర్ కోలుకున్నాక అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే విచారణలో ఎబినేజర్ ఓ డెత్ నోట్ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని పోలీసులు తెలిపారు. అందులో ఏముందంటే?.. నా భార్య గత కొంత కాలం నుంచి మోడ్రన్ డ్రెస్ లు ధరిస్తూ వచ్చింది. నాకు నచ్చకపోవడంతో వద్దని వాదించాను. అయినా వినకుండా అలాగే తరుచు వేసుకునేది. ఇక ఇదే కాకుండా బ్యూటీపార్లర్ కు వెళ్లొద్దని కూడా చెప్పాను. నా మాట వినకుండా అలాగే వెళ్లింది.
ఈ కారణాలతో మా ఇద్దరి మధ్య తరుచు గొడవలు జరిగాయి. కొంత కాలం తర్వాత మళ్లీ ఇద్దరం కలిశాం. నాకు అప్పుడు తెలిసింది. నా భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఆమెకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ను ఉన్నారు. తరుచు అర్థరాత్రి నేను పడుకున్నాకా.. నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతూ ఉండేది. కాగా, ఈ ఘటన రోజు నా భార్యకు ఇలాంటి తప్పులు చేయకు అని చెప్పినా కూడా వినలేదు. దీంతో ఇవన్నీ నాకు నచ్చకపోవడంతో కోపంలో నా భార్యను చంపాను అంటూ భర్త ఎబినేజర్ 11 పేజీల డెత్ నోట్ రాసి, కొన్ని స్క్రీన్ షాట్ లు జత చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇక ఈ డెత్ నోట్ చూసిన అనంతరం పోలీసులు నిందితుడు ఎబినేజర్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయానలు కామెంట్ రూపంలో తెలియజేయండి.