ఇతని పేరు జయంతన్. చెన్నై ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో థాయ్ ఎయిర్ వేస్ లో స్టాఫ్ గా పని చేస్తుండేవాడు. జయంతన్ కి 2020లో తంబారంలో జయలక్ష్మి అనే యువతి పరిచయం అయింది. వీరి పరిచయం ప్రేమగా మారడంతో అతను ప్రియురాలిని గుడిలో పెళ్లి చేసుకున్నాడు. కట్ చేస్తే.. ఏడాది తర్వాత అతను పెళ్లి చేసుకుంది వేశ్యని పెళ్లి చేసుకున్నాని తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
దేశంలో ప్రేమ పేరుతో ఎన్నో దారుణాలు వెలుగు చూస్తున్నాయి. కొన్నాళ్ల పాటు ప్రేమ పేరుతో ఎంజాయ్ చేస్తూ చివరికి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. చేసుకున్నాక సంతోషంగా ఉంటున్నారా అంటే అదీ లేదు. పెళ్లైన కొన్ని రోజులకే మనస్పర్థలు, వివాహేతర సంబంధాల కారణాలతో హత్యలు, ఆత్మహత్యలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇకపోతే అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ అమాయక యువకుడు వేశ్య అని తెలియక ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు ఇద్దరూ సంసారం చేశారు. కట్ చేస్తే.. అసలు విషయం తెలిసి భర్త ఆమె నుంచి దూరం జరిగాడు. ఇక్కడి నుంచే వీరి కథ ఊహించని మలుపుకు తీసుకుంది. ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?
చెన్నైలోని ఓ ప్రాంతంలో జయంతన్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతడు చెన్నై ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో థాయ్ ఎయిర్ వేస్ లో స్టాఫ్ గా పని చేస్తుండేవాడు. అయితే జయంతన్ కి 2020లో తంబారంలో జయలక్ష్మి అనే యువతి పరిచయం అయింది. వీరి పరిచయం రాను రాను ప్రేమగా మారింది. దీంతో జయంతన్ మాత్రం ఆ అమ్మాయి ఎవరు, ఏంటి అనే ఏ వివరాలు తెలుసుకోకుండా ఆమెను పిచ్చి పిచ్చిగా ప్రేమించాడు. అలా కొన్నాళ్ల పాటు వీరి ప్రేమాయణం కొనసాగింది. ఇక కొంత కాలం తర్వాత ఈ ప్రేమికులు ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవడంతో జయంతన్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
షాకింగ్ న్యూస్ ఏంటంటే? 2021 జనవరిలో జయలక్ష్మి వేశ్య అని భర్త జయంతన్ కు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న భర్త జయంతన్ ఆమెను నిలదీశాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో అప్పటి నుంచి ఇద్దరూ విడిపోయారు. అయితే మార్చి 18న జయలక్ష్మి మాజీ ప్రియుడు జయంత్ కు ఫోన్ చేసి నీతో మాట్లాడాలని చెప్పింది. దీనికి సరే అన్న జయంతన్.. ఆమె చెప్పిన చోటుకు వెళ్లాడు. అక్కడికి వెళ్లాక ఇద్దరు మరోసారి గొడవ పడ్డారు. దీంతో జయలక్ష్మి తనకు తెలిసిన ముగ్గురు వ్యక్తులను అక్కడికి వెంటనే రమ్మని కబురు పంపింది. క్షణాల్లో వాళ్లు అక్కడి వాలిపోయారు.
అనంతరం జయలక్ష్మి చెప్పినట్లుగా ఆ ముగ్గురు దుండగులు జయంత్ ను అతి దారుణంగా హత్య చేసి అతని కాళ్లు, చేతులు, తల, మొండం వేరుగా చేశారు. ఇక గత నెల 20న నరికిన జయంత్ కాళ్లు, చేతులు ప్లాస్టిక్ బ్యాగులో తీసుకుని చెన్నైలోని కోవలం దగ్గర కాల్చి వేశారు. అదే ప్రదేశంలో మిగతా శరీర భాగాలైన తల, మొండాన్ని 400 మీటర్ల లోతుతో పాతి పెట్టి అక్కడి నుంచి పుదుకొట్టయ్ కు వెళ్లారు. అయితే ఉన్నట్టుండి జయంత్ కనిపించకపోవడంతో అతని కుటుంబ సభ్యుల మార్చి 21న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు జయంతన్ ఆచూకి గురించి గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసుల విచారణలో భాగంగా అతని భార్య అయిన జయలక్ష్మిని కూడా అదుపులోకి విచారించగా.. ఆమె సంచలన నిజాలు బయటపెట్టింది. నేనే నా ప్రియుడిని కొంతమందితో కలిసి హత్య చేశానని, ఆ తర్వాత అతని కాళ్లు, చేతులను కాల్చేసి, మిగతా శరీర భాగాలను కోవలంలోని ఓ ప్రదేశంలో పాతిపెట్టామని నిందితురాలు జయలక్ష్మి ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె చెప్పిన వివరాలు విన్న జయంతన్ కుటుంబ సభ్యులు, పోలీసులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అనంతరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు జయలక్ష్మిని అరెస్ట్ చేసి మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ప్రియుడిని అతి కిరాతకంగా హత్య చేసిన ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.