బిస్కెట్ల హోల్‌సేల్ వ్యాపారం చేసే ఆ కుర్రాడు ఓ బాలికతో తప్పటడుగులు వేయించాడు. ఓ షాపు ఓనర్ కూతురైన బాలికను చనువుగా మాట్లాడి ముగ్గులోకి దించాడు. ‘హాయ్’తో మొదలుపెట్టి ఆమెను అన్ని రకాలుగా వాడుకున్నాడు. కూతురు గంటల తరబడి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతోందని తెలిసి ఆరా తీశాడు ఆమె తండ్రి. బిస్కెట్ల వ్యాపారి తన కూతురితో సంబంధం పెట్టుకున్నాడని తెలిసి షాక్ అయ్యాడు. చివరి పోలీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చెన్నైకి చెందిన 23 ఏళ్ల ప్రవీణ్ కుమార్ బిస్కెట్ల వ్యాపారం చేస్తుంటాడు. నగరంలోని అన్ని షాపులకు తిరిగి ఆర్డుర్లు తీసుకుని వారికి సప్లై చేస్తుంటాడు. తిరువొత్తియార్‌కు చెందిన అశోక్ కుమార్ షాపునకు కూడా ప్రవీణ్ బిస్కెట్లు సప్లై చేస్తుంటాడు. అతడి షాపు దగ్గరకు తరుచూ వచ్చిపోతుంటాడు.
ఈ నేపథ్యంలోనే పదవ తరగతి చదివే అశోక్ కూమార్ కూతురుతో ప్రవీణ్‌కు పరిచయం ఏర్పడింది. ‘హాయ్’తో మొదలుపెట్టిన కొన్ని రోజులకే ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఫోన్‌లో గంటల తరబడి మాట్లాడుకునేవారు. కొన్ని రోజుల తర్వాత లైంగిక సంబంధానికి బాలికను ఒప్పించాడు. తర్వాత నుంచి తరుచూ వారు లైంగికంగా కలిసేవారు. రోజులు గడుస్తున్నాయి. కూతురు గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడుతుండటంతో అశోక్‌కు అనుమానం వచ్చింది. కూతుర్ని నిలదీశాడు. ప్రవీణ్‌తో మాట్లాడుతున్నానని చెప్పింది. లైంగిక సంబంధం గురించి కూడా చెప్పింది. దీంతో అతడు షాక్ అయ్యాడు. ప్రవీణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : కామాంధుడు.. ఆడపిల్లల ముందు నగ్నంగా రౌండ్లు.. వద్దన్నందుకు..
చెట్టుకు వేలాడుతూ మహిళ పుర్రె.. ఇంతకీ ఎవరామె?..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.