ఈ మధ్యకాలంలో దొంగలు బీభత్సంగా రెచ్చిపోతున్నారు. సులభంగా డబ్బులు సంపాదించుటకు అనేక అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. లగ్జరీ లైఫ్ కు అలవాటుపడి వారి అవసరాలను తీర్చుకునేందుకు దొంగతనాలకు పాల్పడుతున్నారు.
ఈ మధ్యకాలంలో కొంతమంది కేటుగాళ్లు ఈజీ మనీ కోసం దొంగతనాలు, దోపిడీలు చేస్తున్నారు. బండ్లపై ఒంటరి మహిళలను గమనిస్తూ ఒకరు మాటలతో మరల్చుతూ బైక్‌పై వచ్చినవారు చైన్స్ తెంపుకెళ్లడం మామూలు అయిపోయింది. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి వాటి కోసం తప్పుదోవ పడుతున్నారు. కొంతమంది ఇల్లు, షాప్, గుడి, బడి తేడా లేకుండా అన్నింటినీ దోచేస్తున్నారు. చదువుకున్న వారు కూడా పనులు చేయడానికి ఇష్టపడక దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో మళ్లీ చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్ చేస్తోంది. ఒకేసారి గుంపుగా వచ్చి ఇళ్లలో చొరబడి చోరీలకు పాల్పడుతుంటారు. చెడ్డీ గ్యాంగ్ దొంగతనాలకు పాల్పడుతున్న సీసీటీవీ వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మియాపూర్‌లోని ఓ విల్లాలో భారీగా నగదు, గోల్డ్ దొంగిలించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం..
హైదరాబాద్ నగరంలో చెడ్డీ గ్యాంగ్ కలకలం సృష్టిస్తోంది. పలు కాలనీల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతోంది. వీరు చెడ్డీలు వేసుకుని, తలకు ముసుగులతో చేతిలో మారణాయుధాలతో గుంపుగా తిరుగుతుంటారు. చోరీచేసే సమయంలో ఎంతటి ఘాతుకానికైనా తెగిస్తారు. వీరు తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్‌గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతుంటారు. తాజాగా మియాపూర్, హైటెక్ సిటీ పరిధిలోని వసంత విల్లాస్‌లో చెడ్డీగ్యాంగ్ తెగబడింది. ఆగస్టు 7 రాత్రి వసంత్ ర్యాలీ 17వ విల్లాలో ఐదుగురు చెడ్డీగ్యాంగ్ దొంగలు ఇంట్లోకి చొరబడి చోరీ చేశారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో బాత్రూం వెంటిటేషన్ అద్దాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. సుమారు 30 తులాల బంగారు నగలను దొంగిలించారు. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.