చెడ్డీ గ్యాంగ్.. ఈ పేరు వినగానే చాలా మంది భయంతో వణికిపోతారు. కొంతమందికి కంటి మీద కునుకు కూడా పట్టదు. ఇక పోలీసులకి సైతం చెడ్డీ గ్యాంగ్ పేరు వింటేనే హడల్. ఎందుకంటే వీరిని పట్టుకోవడానికి కుదరదు. ఒళ్ళంతా ఆయిల్ పూసుకుని, ఒంటి మీద ఒక చిన్న చెడ్డీ వేసుకుని మాత్రమే ఉంటారు. దొంగతనం చేయడంలో విచిత్రమైన పద్ధతి, క్రూరత్వంతో నిండిన జీవన విధానం, డబ్బు కోసం ఈజీగా ప్రాణాలు తీసేసే స్వభావం. ఇది చెడ్డీ గ్యాంగ్ స్టైల్. అసలు ఎవరీ ఈ చెడ్డీ గ్యాంగ్? వీరు ఎలా పుట్టుకొచ్చారు. వీరి చరిత్ర ఏమిటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ISSUED IN PUBLIC INTEREST 📢📢#CheddiGang #Vijayawada #Kakinada pic.twitter.com/2edBE3mRjx
— వై.ఎస్.కాంత్ (@yskanth) December 10, 2021
1987 నుండి చెడ్డీ గ్యాంగ్ దొంగతనాలు చేస్తూ వస్తోంది. కానీ.., ఇలాంటి గ్యాంగ్ ఒకటి ఉందని, వీరే దొంగతనాలు చేస్తున్నారని పోలీసులకి తెలిసింది మాత్రం1999లో! అంటే.. పది సంవత్సరాల పైగా వీరు ఉన్నారని కూడా ఎవ్వరికీ తెలియకుండా పోయింది. 90వ దశకం చివరిలో సామాన్య ప్రజలు సీసీ కెమెరాలను వాడటం మొదలు పెట్టారు. ఆ దృశ్యాలలో వీరు రికార్డు అవ్వడంతోనే మొదటిసారిగా చెడ్డీ గ్యాంగ్ గురించి బయట ప్రపంచానికి తెలిసింది. అప్పటి నుండి చెడ్డీ గ్యాంగ్ ని పట్టుకోవడం అనేది పోలీసులకి తలకి మించిన భారం అయిపోయింది.
అసలు చెడ్డీ గ్యాంగ్ పుట్టింది గుజరాత్ లోని ధవోద్ జిల్లాలోని గూద్ బాలా తాలూకాలో ఉన్న నహేడా అనే గిరిజన గ్రామంలో. అడవిలోని పోడు భూములలో వ్యవసాయం చేసుకోవడం, అక్కడ జీవులను వేటాడటం వీరు ప్రధాన వృత్తి. ఫేస్ పార్థి తెగ అని వీరికి పేరు. మొదట్లో వీరు ఎలాంటి దొంగతనాలు చేయకుండా తమకి ఉన్నంతలో కష్టపడే బతుకుతూ వచ్చారు. కానీ.., ప్రకృతి వీరిపై పగ పట్టింది. అడవిలోని పోడు భూముల్లో వ్యవసాయం అంటే నీటి సౌకర్యం ఉండదు. అతివృష్టి, అనావృష్టి లేకుండా వర్షం పడితేనే పంట చేతికి వస్తుంది. కానీ.., తరువాత ప్రకృతి సహకరించకపోవడంతో వీరికి వ్యవసాయం కలసి రాలేదు. ఇదే సమయంలో అడవిలో జతువులను వేటాడటం ప్రభుత్వం నిషేదించింది.
వీరికి చదవు లేదు, ప్రభుత్వం నుండి ఎలాంటి గుర్తింపు కార్డు లేదు. ప్రభుత్వ పథకాలు అందేది లేదు. ఇలా వీరి జీవినానికే ముప్పు వచ్చి పడింది. ఇలాంటి సమయంలో ఆ తెగ పెద్ద రాంజీ.. ఒక 5 మంది కుర్రాళ్ళతో చెడ్డీ గ్యాంగ్ ని తయారు చేశాడు. వారికి బాగా ట్రైనింగ్ ఇచ్చాడు. నాయకుడు రాంచీ వీరికి దొంగతనాలు చేయడానికి కొన్ని సూత్రాలను పాటించాలని కూడా చెప్పాడు. అలా మొదలైన ఆ ఒక్క గ్యాంగ్.. ఇప్పుడు పెరుగుతూ వచ్చింది. ఈ తెగలోనే కొన్ని పదుల గ్యాంగ్స్ పుట్టుకొచ్చాయి. కానీ.., దొంగతనం చేయడంలో మాత్రం అందరిదీ ఒకటే స్టయిల్. ఇప్పటికీ ప్రతి చెడ్డీ గ్యాంగ్ కూడా గురువు రాంచీ చెప్పిన ఆ సూత్రాలనే పాటిస్తూనే దొంగతనాలు చేస్తోంది. ఆ సూత్రాలు వింటే ఒక్కొక్కరికి వెన్నులో వణుకు పుట్టక తప్పదు. అవి ఏమిటో ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం.
Proud moment for AP police.
CM Inti dheggarlo cheddi gang hulchul pic.twitter.com/873C1RTy4v
— paul esupadham (@hustler243) December 8, 2021
A five member #CheddiGang (burglars) caught on camera in Vasanth Nagar Colony in #Poranki near #Vijayawada on the early hours of Tuesday.3.5 kgs silver,2.5 souverigns gold & Rs 10,000 stolen from a businessman’s house.@xpressandhra @Kalyan_TNIE @NewIndianXpress @VjaCityPolice pic.twitter.com/Jbjv9jdDkK
— Sistla Dakshina Murthy (@Murthy_TNIE) December 9, 2021
ఈ ముఠాలు ముందుగా ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ముంబై వంటి ప్రాంతాల్లో దొంగతనాలు చేసేవి. కానీ.., చాలా ఏళ్ళ తరువాత అక్కడ పోలీసులు వీరి ఆట కట్టించడంతో సౌత్ పై కన్నేశారు. చెడ్డీ గ్యాంగ్ లోని ఒక్కో గ్రూప్ లో 6 నుండి 8 మంది సభ్యులు ఉంటారు. తమకి కావాల్సినంత సొత్తు వచ్చాక, ఆ డబ్బుని పంచుకుని వీరు విడివిడిగా మాత్రమే తమ గమ్య స్థానాలను చేరుకుంటారు. అది కూడా కేవలం రైలు మార్గంలోనే. ఎందుకంటే వీరు రైలులో గుంపుల మధ్య తప్ప.. ఇక ఎందులోను ప్రయాణం చేయడానికి ఇష్టపడరు.
ఇప్పుడు వీరి టార్గెట్ ఆంధ్రప్రదేశ్ అయ్యింది. వీరు ఏపీని టార్గెట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో వీరు పాతిక ఇళ్లల్లో దొంగతనాలు చేశారు. ఇప్పుడు మాత్రం విజయవాడలో వరుస దొంగతనాలతో రెచ్చిపోతున్నారు. విజయవాడ పోలీసులు కంటిపై కునుకు లేకుండా కష్టపడుతూనే ఉన్నా.. ఈ చెడ్డీ గ్యాంగ్ మాత్రం వరుస దొంగతనాలతో రెచ్చిపోతున్నారు. ఇప్పటికే విజయవాడ పోలీసులు చెడ్డీ గ్యాంగ్ ఫోటోలను విడుదల చేశారు. మరి.., పోలీసులు త్వరలోనే వీరి ఆట కట్టిస్తారేమో చూడాలి. మరి.. చెడ్డీ గ్యాంగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
An alert resident foiled a #CheddiGang ‘s theft attempt at an apartment in Guntupalli, Krishna district.
The resident sensed and turned on the lights. They fled silently.
The 5-member team’s arrival and leaving scenes caught on CCTV cameras.#AndhraPradesh
1/2 pic.twitter.com/rZvSHFnhzV— P Pavan (@PavanJourno) December 2, 2021