వారిద్దరివీ వేరు వేరు రాష్ట్రాలు. అయినా సరే ఇష్టపడి ప్రేమించుకున్నారు. చివరికి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ వీరి పెళ్లికి పెద్దలు అంగీకారం తెలపలేదు. ఏం చేయాలో తెలియక పెద్దలను ఎదురుంచి మరీ ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. ఇక కొన్నాళ్లకి వీరి పెళ్లిని ఇరువురి తల్లిదండ్రులు అంగీకరించి వారిని అక్కును చేర్చుకున్నారు. దీంతో పెళ్లైన కొంత కాలం వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. ఇక పెళ్లై ఏడు నెలలు అవుతుంది. వివాహ సమయంలో ఎలాంటి కట్న, కానుకలు తేలేదని భర్తతో పాటు అత్తింటి వాళ్లు జ్యోతిని వేధింపులకు గురి చేశారు.
ఈ వేధింపులు రోజు రోజుకు ఎక్కువవడంతో భరించలేని ఆ వివాహిత ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. తాజాగా ఈ ఘటన హైదరాబాద్ లోని చాంద్రాయణగుట్టలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం బసవకళ్యాణ్ కు చెందిన పవన్ కుమార్ తల్లిదండ్రులతో పాటు కొన్నేళ్ల నుంచి చాంద్రాయణగుట్టలో నివాసం ఉండి పాతబస్తీలోని ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తున్నాడు. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన జ్యోతి అనే యువతి సైతం అదే ప్రాంతంలో తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది. అయితే ఈ యువతి, యువకుడికి పరిచయం ఏర్పడింది.
ఇది కూడా చదవండి: Visakhapatnam:పెళ్లైన కొత్త జంటను కర్కశంగా విడదీసి.. పసుపు కుంకుమలను రక్తంతో తుడిచేసింది!
ఆ పరిచయం రాను రాను ప్రేమగా మారింది. దీంతో ఒకరినొకరు ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఆర్యసమాజ్ లో పెళ్లి కూడా చేసుకున్నారు. మొదట్లో వీరి పెళ్లికి వీరి తల్లిదండ్రులు అంగీకరించలేదు. కొంత కాలానికి వీరిరువురి తల్లిదండ్రులు అంగీకరించి వారిని అక్కున చేర్చుకున్నారు. అయితే పెళ్లైన కొంత కాలం వీరి కాపురం బాగానే సాగింది. కానీ రోజులు గడిచే కొద్ది భర్తతో పాటు అత్తింటి కుటుంబం వరకట్నం తేవాలంటూ జ్యోతిని తీవ్రంగా వేధింపులకు గురి చేశారు. వీటిని ఆ వివాహిత తట్టుకోలేకపోయింది. ఏం చేయాలో తెలియక ఇటీవల ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూతరు మరణవార్త తెలుసుకున్న జ్యోతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్త, అత్తామామల వేధింపుల కారణంగానే నా కూతురి ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.