యూనీవర్సిటీలో చదివే విద్యార్థిని అంటే.. మంచి తెలివితేటలు ఉంటాయని ఎవరైనా భావిస్తారు. అది నిజం కూడా. అయితే తెలివితేటలు ఉండటం వేరు.. లౌక్యం, లోకజ్ఞానం, సమాజ పోకడ తీరుపై అవగాహన ఉండటం వేరు. అవి లోపించి.. అమాయకంగా ఉంటే.. స్వయంగా మనం ప్రమాదంలో పడటమే కాక.. ఇతరులకు కూడా హానీ చేస్తాం. చండీగఢ్ యూనివర్సిటీ వీడియో లీక్ వ్యవహారంలో నిందితురాలిది కూడా ఈ తరహా వ్యక్తిత్వమే. ఆమె అమాయకత్వాన్ని ఆసారాగా చేసుకుని.. ఓ కామంధుడు నీచానికి ఒడిగట్టాడు. ఆమె నగ్న వీడియోలు పంపాల్సిందిగా కోరడం.. బాధితురాలు కూడా ఏ మాత్రం ఆలోచన లేకుండా వీడియోలు పంపడం.. చివరకు అది కాస్త లీకవ్వడంతో ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
చండీగఢ్ యూనివర్సిటీ హాస్టల్‌లో ఉంటున్న నిందితురాలు.. సీక్రెట్‌గా తోటి విద్యార్థినిల ప్రైవేట్ వీడియోలు తీసి.. తన స్నేహితుడికి పంపిందని.. అతడు వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడని.. సుమారు 60 మంది విద్యార్థానిల వీడియోలు లీకయ్యాయనే వార్త నిమిషాల వ్యవధిలో దావానంలా వ్యాపించింది. దాంతో హాస్టల్ విద్యార్థినిలు యూనివర్సిటీ ప్రాంగణంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. వారి ఆందోళనతో వర్సిటీ అట్టుడికి పోయింది. అయితే ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే పలు అసత్యాలు ప్రచారం అవుతున్నాయి. అసలు ఇంతకు యూనివర్సిటీలో ఏం జరిగింది.. పోలీసులు ఏం చెబుతున్నారు వంటి పూర్తి వివరాలు..
చండీగఢ్ యూనివర్సిటీలో చదువుతున్న నిందితురాలికి.. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ ట్రావెల్ ఏజెంట్‌తో పరిచయం ఏర్పడింది. ఈ స్నేహంలో సదరు వ్యక్తి.. విద్యార్థిని అమాయకత్వాన్ని ఆసారాగా చేసుకుని.. ఆమె ప్రైవేట్ వీడియోలను తనకు పంపేలా చేసుకున్నాడు. ఈ క్రమంలో అతడి మాటలు నమ్మిన యువతి.. బాత్రూంలో స్నానం చేస్తూ వీడియో రికార్డు చేసుకుని స్నేహితుడికి పంపుతూ వస్తోంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం నిందితురాలు.. బాత్రూం డోర్ కింద ఫోన్ పెట్టి వీడియో, ఫోటోలు తీయడం మిగతా విద్యార్థినులు గమనించారు. మొబైల్ లాక్కొని చూడగా.. దానిలో విద్యార్థినిల ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. ఇది కాస్త బయటకు పొక్కడంతో.. స్టూడెంట్స్ తీవ్రంగా ఆందోళన చెందారు. నిందితురాలు వీటిని తన స్నేహితుడికి పంపినట్లు తెలియడంతో షాకయ్యారు. ఇక హాస్టల్ వార్డెన్.. వీడియో లీకేజీల గురించి సదరు యువతిని ప్రశ్నిస్తున్న వీడియో వైరల్ కావడంతో.. ఈ వ్యవహారం పెను దుమారంగా మారింది.
ఈలోపే నిందుతురాలి స్నేహితుడు.. సుమారు 60 మంది విద్యార్థినిల ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడంటూ పుకార్లు మొదలయ్యాయి. వాటిని నిజమని భావించిన విద్యార్థినిలు యూనివర్సిటీ ప్రాంగణంలో ఆందోళనకు దిగారు.. పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. విషయం పెద్దది కావడంతో భారీ ఎత్తున పోలీసులు యూనివర్సిటీలో మోహరించారు. ఆగ్రహంతో ఊగిపోతున్న విద్యార్థినులు.. నిందితురాలిపై దాడి చేస్తారనే ఉద్దేశంతో ఆమెను ఓ గదిలో బంధించారు.
అనంతరం పోలీసులు ఈ సంఘటన గురించి విచారించగా వాస్తవాలు ఒక్కోటిగా వెలుగులోకి వచ్చాయి. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితురాలు కేవలం తన వీడియోలను మాత్రమే ఆమె స్నేహితుడికి పంపినట్లు తెలిసింది. ఇప్పటి వరకు నిందితురాలి మొబైల్‌లో కేవలం ఆమెకు సంబంధించిన 4 ప్రైవేట్ వీడియోలు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. ప్రస్తుతం నిందితురాలి మొబైల్‌ని ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపామన్నారు. ఇక నిందితురాలి మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని.. అంతేకాక సిమ్లాలో ఉంటున్న ఆమె స్నేహితుడిని కూడా అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.
ఇక వీడియోల లీకేజీ వ్యవహారం గురించి తెలిసిన వెంటనే కొందరు విద్యార్థినిలు ఆత్మహత్యాయత్నం చేశారంటూ వచ్చిన వార్తలు అసత్యం అన్నారు పోలీసులు. విషయం తెలియగానే ఒక్క యువతి మాత్రం స్పృహ తప్పి పడిపోయిందని.. ఆమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించామని.. ప్రస్తుతం సదరు విద్యార్థిని పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.
ఈ వ్యవహారంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్పందించారు. దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపిస్తామని.. దోషులను కఠినంగా శిక్షిస్తామని విద్యార్థినిలకు హామీ ఇచ్చాడు. ఈ సంఘటనపై జాతీయ మహిళా కమిషన్ సైతం స్పందించింది. వీడియోల వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి.. సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ పంజాబ్ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖాశర్మ లేఖ రాశారు. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో యూనివర్సిటీకి సెలవు ప్రకటించారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Protest breaks out in Chandigarh University after someone secretly recorded videos of girls from hostel bathroom and leaked them online. University administration is trying to muzzle the protest, according to a student : @PunYaab
— Yogita Bhayana योगिता भयाना (@yogitabhayana) September 17, 2022
This girl viral the 60 girls mms in Chandigarh university kindly take strict action on this girl @INCChandigarh @narendramodi @ChandigarhUT #chandigarhuniversity #justiceforcugirls pic.twitter.com/7JVHN0oBNZ
— Shanu XD (@shanu00001) September 17, 2022