ఈజీ మనీ కోసం కేటుగాళ్ళు అనేక అక్రమాలకు పాల్పపడుతున్నారు. ఇందుకోసం దొంగతనాలు, చైన్ స్నాచింగ్, డ్రగ్స్ వ్యాపారం లాంటివి చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. ఆ సమయంలో ఎదుటి వారి ప్రాణాలు తీయడానికి కూడా లెక్కచేయడం లేదు.
ఇటీవల కొంతమంది ఈజీ మనీ కోసం అనేక అక్రమాలకు పాల్పపడుతున్నారు. తాము డబ్బు సంపాదించడానికి ఎదుటివారిని ఎలాగైనా బురిడీ కొట్టిస్తున్నారు.. కొన్ని సార్లు ప్రాణాలు తీయడానికి కూడా లెక్కచేయడం లేదు. ముఖ్యంగా అక్రమాలకు పాల్పపడే కేటుగాళ్ళు ఎక్కువగా హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్ వ్యాపారం, చైన్ స్నాచింగ్ లాంటివి చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఇక ఆ మద్య చెడ్డీ గ్యాంగ్ పలు రాష్ట్రాల్లో సంచలనాలు సృష్టించారు. హైదరాబాద్ లో ఇటీవల చైన్ స్నాచింగ్ ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ మెడ నుంచి గొలుసు దొంగతనానికి ప్రయత్నించిన దొంగను స్థానికులు దేహశుద్ది చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ కూరగాయలు కొనుగోలు చేయడానికి రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తుంది. అదే సమయంలో ఓ వ్యక్తి బైక్ పై వచ్చి సైనిక్ పురీ కి ఎటుగా వెళ్లాలని ఆ మహిళలను అడిగాడు.. ఆమె తనకు తెలియదు అని సమాధానం చెప్పేలోగా కళ్లలో కారం మెడపై ఉన్న గొలుసు దొంగిలించే ప్రయత్నం చేశాడు. అంతలోనే ఆ మహిళ భర్త అటుగా రావడం.. స్థానికుల సహాయంతో దొంగను పట్టుకోవడం జరిగింది. చోరీకి యత్నించిన దొంగకి స్థానికులు దేహశుద్ది చేశారు. ఆ నింధితుడి వద్ద లభించిన ఆధారాల ప్రకారం అతని పేరు సంతోష్ కుమార్ అని.. అతని వద్ద రెండు ఆధార్ కార్డులు, పాన్ కార్డులు లభించాయని అంటున్నారు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇటీవల నగరంలో చైన్ స్నాచింగ్ లు ఎక్కువ అయ్యాయి. ఇటీవల గంటల వ్యవధిలో నాలుగు ఐదు చైన్ స్నాచింగ్స్ జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకొని బైక్స్ పై వచ్చి చైన్ స్నాచింగ్ కి పాల్పపడుతున్నారు. ఈ క్రమంలో కొంత మంది మహిళలు కిందపడిపోయి ప్రాణాలు పోవడం.. తీవ్ర గాయాల పాలు కావడం జరుగుతుంది. రెప్పపాటున జరిగిపోతున్న ఈ ఘటనలపై పోలీసులు గట్టి నిఘా పెడుతున్నప్పటికీ చైన్ స్నాచర్లు ఎక్కడో అక్కడ రెచ్చిపోతున్నారు. రోడ్డు పై మహిళలు పట్ట పగలు ఒంటరిగా నడవాలన్నా చైన్ స్నాచర్లు ఎప్పుడు ఏ మూల నుంచి వస్తారో అని భయాందోళనుకు గురి అవుతున్నారు.