ఇటీవల ఈజీ మనీ కోసొం కొంతమంది ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో అక్కడ చోరీలు జరుగుతూనే ఉన్నాయి.
ఈజీ మనీ కోసం కొంతమంది కేటుగాళ్ళు ఎన్ని దారుణాలకైనా తెగబడుతున్నారు. ఎదుటి వారిని ఎలాగైనా మోసం చేసి డబ్బు కొట్టేస్తున్నారు. ఒకప్పుడు రాత్రుళ్లు ఎవరూ లేని సమయంలో మెల్లిగా ఇంట్లో దూరి దోపిడీ చేసేవారు.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. పట్టపగలే ఇంట్లో దూరి గన్, కత్తులతో బెదిరించి ఉన్నదంతా దోచుకువెళ్తున్నారు. పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా దొంగలు రోజు రోజుకీ రెచ్చిపోతున్నారు. తాజాగా కెపిహెచ్ బి పోలీస్ స్టేషన్ పరిధి పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు.. మహిళ మెడలో గొలుసు చోరీ చేశారు. వివరాల్లోకి వెళితే..
ఇటీవల హైదరాబాద్ లో దొంగలు రక రకాలుగా చోరీలకు పాల్పపడుతున్నారు. ఇల్లు అద్దకు ఉందా అంటూ కొంతమంది.. వస్తువులు సేల్స్ చేస్తామని కొంతమంది ఇలా రక రకాలుగా వేషాల్లో వస్తూ ఒంటరిగా ఉన్న ఆడవాళ్లను బెదిరించి దొచుకు వెళ్తున్నారు. తాజాగా హైదరాబాద్ కెపిహెచ్ బి పోలీస్ స్టేషన్ పరిధి నిజాంపేట్ రోడ్ ప్రశాంత్ నగర్ లో దుండగులు రెచ్చిపోయారు. ఓ అపార్ట్ మెంట్ వద్ద టులేట్ బోర్డు చూసి ఇల్లు అద్దెకు ఉందా అంటూ ఫ్లాట్ వద్దకు వెళ్లి డోర్ కొట్టారు. ఓ వృద్దురాలు డోర్ తెరవగానే దుండగులు ఆమె నోట్లో మైదా పిండి కుక్కి మెడలో ఉన్న చైన్ లాక్కెల్లిపోయారు. చైన్ నాలుగు తులాల వరకు ఉంటుందని బాధితురాలు మహాలక్ష్మి తెలిపింది. పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకొని సీసీ టీవి ఫుటేజ్ పరిశీలించి దుండగులను కనిపెట్టే పనిలో ఉన్నామని తెలిపారు.