నేటి సమాజంలోని యువత ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, కంప్యూటర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి తోడుగా టెలికాం కంపెనీల నుంచి తక్కువ ధరకే అధిక డేటా లభిస్తుండటంతో యూట్యూబ్ లో ఇష్టమొచ్చిన వీడియోలు చూస్తూ జాలీగా గడపుతున్నారు. మారుతున్న కాలానికి అనుగూణంగా స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, కంప్యూటర్లు వాడితే తప్పుదు లేదు. కానీ మితిమీరి వాడుతుండటంతో లేనిపోని సమస్యలను కొని తెచ్చుకోవాల్సి వస్తుందని తెలియజేస్తున్నారు సైకాలజిస్టులు.
ఇక ప్రధానంగా ఈ కాలం యువత ఎక్కువగా బ్లూ ఫిల్మ్స్ చూడటం అలవాటు చేసుకుని తమ పక్కనున్న స్నేహితులను కూడా చెడగొడుతూ చెడు దారుల్లోకి వెళ్తున్నారు. అయితే అలాంటి బ్లూ ఫిల్మ్స్ చూసే యువతకు ఖంగుతినే వార్తను అందించింది కేంద్ర హోంశాఖ. ఇక విషయం ఏంటంటే..? ఎవరైతే బ్లూ ఫిల్స్మ్ చూస్తున్నారో వారి ల్యాప్ టాప్, మొబైల్ ఐపీ చిరునామా ఆధారంగా నిందితులను గుర్తించి ఆయా రాష్ట్రాలకు నివేదికలు పంపుతుందట కేంద్ర హోంశాఖ. ఇక ఇలాంటి నీలి చిత్రాల వెబ్ సైట్ లను చూస్తున్నవారిని జాతీయ నేర గణాంక సంస్థ గుర్తిస్తుందట.
దీంతో అలా ఇప్పటి వరకూ కొంతమందిని గుర్తించటంతో పాటు 1,095 మందిని అరెస్ట్ చేశారు అధికారులు. అలా రెండు మూడేళ్ల నుంచి హైదరాబాద్ లోనే 36 మందిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక నిందితుల నేరాన్ని బట్టి భారీ రూ.10 లక్షలు జరిమానాతో పాటు 5 ఏళ్ల జైలు శిక్షవిధిస్తున్నారు సైబర్ క్రైం అధికారులు. ఇక ఇలాంటి అశ్లీల వీడియోల ప్రభావం కారణంగా చిన్నారులపై, మైనర్లపై అకృత్యాలు పెరుగుతున్నాయని దీని కారణంగానే కేంద్ర హోంశాఖ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని తెలుస్తోంది. ఇక కేంద్ర హోంశాఖ తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.