సినిమా ఆఫర్ల కోసం మోడలింగ్ రంగాన్ని ఎంచుకున్న అమ్మాయిలు .. అందాల పోటీలు కానీ, ఫ్యాషన్ వీక్ వంటి వాటిల్లో పాల్గొంటారు. లేదంటే ఫోటో షూట్స్ తీసుకుని ఆఫీసులకు అందిస్తుంటారు. ఈ సమయంలో మోసాలకు కూడా గురి అవుతుంటారు. అలా ఓ నటి మాటలు విని..
చేతి నిండా సంపాదనతో పాటు పేరు ప్రఖ్యాతలు త్వరగా రావాలంటే ఉన్న ఏకైక దారి సినిమా ఇండస్ట్రీ. అయితే ఈ రంగుల ప్రపంచంలో క్లిక్ అయితేనే ఈ రెండు దక్కుతాయి. లేదంటే పెట్టా, బేడా సర్దుకుని తిరిగి వచ్చిన దారి వెళ్లాల్సిందే. ముఖ్యంగా అమ్మాయిలు ఈ రంగంలో రాణించాలంటే స్ట్రగుల్స్ పడాల్సిందే. ఆఫర్ల కోసం మోడలింగ్ రంగాన్ని ఎంచుకున్న అమ్మాయిలు ఆ తర్వాత అందాల పోటీలు, ఫ్యాషన్ వీక్ వంటి వాటిల్లో పాల్గొంటారు. లేదంటే ఫోటో షూట్స్ తీసుకుని ఆఫీసులకు అందిస్తుంటారు. ఏ సమయంలోనైనా దర్శక, నిర్మాతలకు నచ్చి.. సినిమాలో బుక్ చేసుకుని, అనౌన్స్‌మెంట్ వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.
అయితే ఇన్నీ ఇబ్బందులను ఎదుర్కొలేక, కమిట్ మెంట్ వంటివి అంగీకరించ లేక చాలా మంది నటీమణులు వెనక్కు తిరిగి వెళ్లిపోతుంటారు. కొంత మంది ఎన్ని కష్టాలు ఎదుర్కొనైనా ఇక్కడే ఉంటారు. ఆఫర్లు ఇస్తామని చెప్పి మోసపోయిన వారు అనేక మంది ఉన్నారు. అనేక వ్యభిచారులుగా మారిన కథనాలు ఉన్నాయి. అలాగే సినిమాలు ఇప్పిస్తామంటూ కొంత మంది నటీమణులే ట్రాప్ చేసి ఇటుగా తీసుకు వస్తున్న ఘటనలు చూశాం. తాజాగా అలాంటి వ్యవహారమే ఒకటి వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రముఖ నటి ఆర్తి మిట్టల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. క్యాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తూ పని సినిమాలలో హీరోయిన్‌గా నటించిన ఆర్తి కాసుల కోసం కక్కుర్తి పడి దిగజారుడు పనులు చేసింది.
సినిమా ఇండస్ట్రీకి రావాలనుకుంటున్న మోడల్స్‌కు వలవేసి వ్యభిచార ఊబిలోకి లాగింది. వారికి డబ్బు ఆశ చూపించి, సినిమా అవకాశాలు ఇప్పిస్తాననంటూ నమ్మబలికి వారితో వ్యభిచారం చేయిస్తోంది. తాజాగా ముంబైలో వ్యభిచార గృహాలపై దాడి చేస్తున్న క్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ముందుగా ఇద్దరు డమ్మీ కస్టమర్లను ఆమె దగ్గరికి పంపించగా.. అడ్డంగా దొరికిపోయింది. దాంతో పక్క సమాచారంతో దాడులు జరిపి ఆమెను అరెస్టు చేశారు.అదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డు అయింది. పక్క ఆధారాలతో ఆర్తి ఆర్తి మిట్టల్‌ను అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అలాగే ఆ ఘటనలో ఇద్దరు మోడల్స్‌ని కూడా రక్షించి పునరావా కేంద్రానికి పంపించినట్లు తెలిపారు. ఆమె ‘అప్నాపన్’ వంటి టెలివిజన్ షోలలో కూడా పనిచేసింది. ఆర్ మాధవన్‌తో కలిసి ఓ చిత్రం షూటింగ్‌లో ఉన్నట్లు ఆర్తి కొంతకాలం క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.