ఈ రోజుల్లో కనీసం మాట సాయానికి కూడా ఎవ్వరూ ముందుకు రావడం లేదు. అయితే కొన్ని సార్లు సాయం కూడా బెడిసి కొడుతుంది. సాయం చేసేవాడే కాదూ.. సాయం అడగడానికి కూడా భయపడాల్సిన రోజులు వస్తున్నాయని ఈ ఘటన నిరూపించింది.
రూపాయి ఆశించకుండా, ఎలాంటి స్వార్థం లేకుండా చేస్తేనే దాన్ని సాయమంటారు. నేటి స్వార్థ పూరిత లోకంలో.. ఏదైనా చేయాలంటే నాకేంటీ లాభం అని మాట కచ్చితంగా వినిపిస్తోంది. కనీసం మాట సాయానికి కూడా ఎవ్వరూ ముందుకు రావడం లేదు. అయితే కొన్ని సార్లు సాయం కూడా బెడిసి కొడుతుంది. సాయం చేసేవాడే కాదూ.. సాయం అడగడానికి కూడా భయపడాల్సిన రోజులు వస్తున్నాయని ఈ ఘటన నిరూపించింది. సాయం అడగడమే పాపమని బోధ పడింది ఆ వ్యక్తికి. సాయం అడిగితే తప్పా అని రాగాలు తీయకండి. అసలు విషయం తెలిస్తే మీరు తెల్లబోతారు కచ్చితంగా.. వివరాల్లోకి వెళితే.
హైదరాబాద్ గాంధీనగర్‌లో ఓ వ్యక్తి రాత్రి పూట కారు డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. గేర్ లాకై.. బండి ఆగిపోయింది. అర్థరాత్రి కావడంతో సాయం అడిగేందుకు కారు దిగి.. అటు, ఇటు చూడగా.. ఎవ్వరూ కనిపించలేదు. దీంతో మళ్లీ కారు స్టార్ చేసేందుకు పలు ప్రయత్నాలు చేశాడు. అయినా స్టార్ కాలేదు. అయితే అతడిని గమనించిన ఓ వ్యక్తి.. కారు యజమాని వద్దకు వెళ్లి ఏమైందని అడిగాడు. కారు ఆగిపోయిందని చెప్పగా.. ‘నేను మెకానిక్‌ని, నేను రిపేర్ చేస్తాను, నువ్వు ఏం ఫికర్ కాకు అని చెప్పాడు’. నిజమేనని నమ్మిన కారు యజమాని రోడ్డుపై నించున్నాడు. కారు ఎక్కిన మెకానిక్, స్టార్ చేసి, రివర్స్ మోడ్ లోనే తిప్పాడు.
దీంతో కారు స్టార్ అయ్యింది. వెంటనే అలా రివర్స్‌లోనే కారుతో ఉడాయించాడు ఆ మెకానిక్. కాస్త దూరం వెళ్లాక తిరిగి వచ్చేస్తాడెమోనని భావించిన వ్యక్తి.. రోడ్డుపై కొంత దూరం వరకు వెళ్లాడు. ఎంతకు కారు తీసుకుని మెకానిక్ రాకపోవడంతో అప్పుడు అర్థమైంది.. కారును కొట్టేశాడని. వెంటనే అతడు పోలీసులను ఆశ్రయించాడు. దీన్ని బట్టి చూస్తే సాయం అడిగేటట్లు లేదని అనిపిస్తుంది కదా. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.